సిడ్నీ: మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ (64 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగడంతో టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ రెండో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.
మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఫిలిప్స్ ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం ఛేదనలో శ్రీలంక 19.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దసున్ షనక (35) టాప్ స్కోరర్ కాగా, కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు పడగొట్టాడు.