Wimbledon : వింబుల్డన్‌లో మరో కొత్త ఛాంపియన్. పొలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ (Iga Swiatek) ఈ మెగా టోర్నీలో విజేతగా అవతవరించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్భుత విజయంతో టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన రెండు సెట్లలో జోరు చూపించిన పొలాండ్ భామ అమెరికా సంచలనం అమందా అనిస్మోవాకు చెక్ పెట్టింది.
రెండో సెట్ గెలుపొందిన తర్వాత సంతోషం పట్టలేకపోయిన స్వియాటెక్ కోర్టులోనే గెంతులు వేస్తూ సంబురాలు చేసుకుంది. ఆ తర్వాత గ్యాలరీలోని తనటీమ్, కుటుంబ సభ్యులతో తన విజయానందాన్ని పంచుకుంది. మొత్తంగా ఆమెకిది ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇక తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన అమెరికా ప్లేయర్ అమందా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
A new Wimbledon champion is crowned 🇵🇱
Iga Swiatek defeats Amanda Anisimova 6-0, 6-0 to win the 2025 Ladies’ Singles Trophy 🏆#Wimbledon pic.twitter.com/ZnznTxwO5A
— Wimbledon (@Wimbledon) July 12, 2025
ఫేవరెట్‌గా వింబుల్డన్ టోర్నీలో అడుగుపెట్టిన స్వియాటెక్ తన కలను సాకారం చేసుకుంది. సెంటర్ కోర్టులో తొలి నిమిషం నుంచి ధాటిగా ఆడిన పొలాండ్ బ్యూటీ 6-0తో తొలి సెట్‌ను అలవోకగా గెలుచుకుంది. అయితే.. అమందా ఎంత ప్రయత్నించినా ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. అదే జోరును చూపించిన స్వియాటెక్ రెండో సెట్‌ను కూడా 6-0తో ముగించి విజేతగా అవతరించింది. దాంతో, వింబుల్డన్ 114 ఏళ్ల చరిత్రలో ఒక్క పాయింట్ కూడా గెలవకుండా ఫైనల్లో ఓడిన క్రీడాకారిణిగా అమందా రికార్డు నెలకొల్పింది.