Black Holes | బహుళ గెలాక్సీల ఢీకొన్న ఫలితమే ఈ విశ్వరూపం. రెండు మహాబ్లాక్ హోల్స్ కలవబోతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న విశ్వం రూపం కోటి సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల ఫలితమే. ఈ కాలంలో ఈ గెలాక్సీలు ఢీకొనేటప్పుడు.. వాటి కేంద్రంలో ఉన్న మహా బ్లాక్ హోల్స్ (Supermassive Black Holes) కూడా విలీనమవుతాయి. తాజాగా శాస్త్రవేత్తలు ఒకే దిశగా ప్రయాణిస్తున్న రెండు గెలాక్సీలను గుర్తించారు. ఇవి త్వరలోనే ఒకదానితో ఒకటి ఢీకొనబోతున్నాయి. నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఒక MCG-03-34-64 అనే గెలాక్సీ మధ్యలో మూడు వేర్వేరు రకాల వెలుగులు ఉన్నాయని గుర్తించింది. వీటిలో రెండు కేవలం 30 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే ఉన్నాయి. రెండు బ్లాక్ హోల్స్, అవి ఒకదానితో ఒకటి దగ్గరగా వస్తున్నాయి.
ఈ రెండు మహా బ్లాక్ హోల్స్ మరో 10 కోట్ల సంవత్సరాల్లో ఒకదానితో ఒకటి విలీనమవుతాయని అంచనా. గెలాక్సీలు, వాటి బ్లాక్ హోల్స్ ఒకదానితో ఒకటి ఢీకొనడం విశ్వం ఆరంభం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇవి గెలాక్సీల అభివృద్ధికి చాలా కీలకమైనవి. మన మిల్కీ వే (Milky Way) కూడా చుట్టుపక్కల ఉన్న చిన్న గెలాక్సీలను ‘తినేస్తూ’ ఉంది. అంతేకాదు.. మిల్కీ వే, సమీప గెలాక్సీ అయిన ఆండ్రోమెడా (Andromeda) కూడా భవిష్యత్తులో విలీనం కానున్నాయి. అయితే, ఇది ఇంకా కోట్లాది సంవత్సరాలు పట్టనున్నది. ఈ ఢీకొనబోయే రెండు బ్లాక్ హోల్స్ తమ తమ గెలాక్సీల మధ్యభాగంలో ఉన్నాయి. గెలాక్సీలు దగ్గరపడతుండగా, ఇవి పరస్పరం ఆకర్షణతో తాకుకుంటూ చివరికి భారీ శబ్దంతో విలీనమవుతాయి. ఈ సంఘటన సమయంలో విపరీత శక్తి విడుదలవనున్నది.