Suryakumar Yadav: టీమిండియా సారథిగా సూర్య..! అధికారిక ప్రకటనే తరువాయి
Suryakumar Yadav: ఈనెల 23 నుంచి స్వదేశంలో భారత్.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. 23న విశాఖపట్నం వేదికగా భారత్ – ఆసీస్ మధ్య తొలి టీ20 జరగాల్సి ఉంది.
Suryakumar Yadav: వన్డే ప్రపంచకప్ ఓటమి తర్వాత టీమిండియా మళ్లీ గ్యాప్ లేకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుంది. ఈనెల 23 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా భారత్ – ఆసీస్ మధ్య తొలి టీ20 జరగాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌కు సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో పాటు హార్ధిక్ పాండ్యా కూడా గాయంతో దూరమవడంతో సెలక్టర్లు.. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను సారథిగా నియమించనుందని సమాచారం.
హార్ధిక్ గైర్హాజరీలో రుతురాజ్ గైక్వాడ్‌ను సారథిగా నియమిస్తారని వినిపించినా సెలక్టర్లు మాత్రం సూర్యకే ఓటేశారని తెలుస్తున్నది. సోమవారం ఉదయం అహ్మదాబాద్ లో జరిగిన సెలక్టర్ల సమావేశంలో ఈ సిరీస్‌లో ఎంపిక చేయాల్సిన జట్టుపై చర్చ జరిగినట్టు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. రోహిత్, విరాట్‌తో పాటు వరల్డ్ కప్‌లో ఆడిన కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, జస్ప్రిత్‌బుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్, శ్రేయస్ అయ్యర్‌లకు సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నారు. హార్ధిక్ గాయంతో దూరమైన నేపథ్యంలో శ్రేయస్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పనున్నారని గతంలో గుసగుసలు వినిపించినా వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడికి కూడా విశ్రాంతినివ్వనున్నారు.
🚨 Suryakumar Yadav set to lead India in the five T20Is against Australia, starting on November 23 pic.twitter.com/PCSHKp36fP
— Cricbuzz (@cricbuzz) November 20, 2023
ఈ ఏడాది ఆసియా కప్‌కు ముందు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టునే ఆసీస్‌తో సిరీస్‌కూ ఎంపిక చేసే అవకాశముంది. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. ఆసీస్‌తో తలపడబోయే భారత జట్టును బీసీసీఐ.. త్వరలోనే ప్రకటించనుంది.
ఇండియా – ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్:
- నవంబర్ 23న తొలి టీ20 : విశాఖపట్నం
- నవంబర్ 26న రెండో టీ20 : తిరువనంతపురం
- నవంబర్ 28న మూడో టీ20 : గువహతి
- డిసెంబర్ 01న నాలుగో టీ20 : రాయ్‌పూర్
- డిసెంబర్ 03న ఐదో టీ20 : బెంగళూరు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

