CSK vs RR : రాజస్థాన్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో చెన్నై బిగ్ వికెట్ పడింది. అటాకింగ్ గేమ్ ఆడుతున్న డారిల్ మిచెల్(22)ను చాహల్ ఎల్బీగా ఔట్ చేశాడు. దాంతో, 67 వద్ద సూపర్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. మోయిన్ అలీ క్రీజలోకి వచ్చాడు. క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులతో ఆడుతున్నాడు. 8 ఓవర్లకు చెన్నై స్కోర్.. 67/2. సీఎస్కే విజయానికి ఇంకా 75 పరుగులు కావాలి.
చెపాక్లో స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై 32 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఈ సీజన్లో పెద్దగా ఫామ్లో లేని రచిన్ రవీంద్ర(27) మరోసారి వికెట్ పారేసుకున్నాడు. అశ్విన్ బౌలింగ్లో బంతిని సరిగ్గా అంచనా వేయలేక అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్, మిచెల్లు ఆచితూచి ఆడుతూ జట్టు స్కోర్ 70 దాటించారు.