Arali Flower Ban | దేవాలయాలకు వెళ్లిన సందర్భంలో ఫలం, పత్రం, పుష్పం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, కేరళలోని ఆలయాల్లో దేవతామూర్తులకు సమర్పించే నైవేద్యంతో పాటు భక్తులకు ఇచ్చే ప్రసాదంలో అరలి పుష్పాలను నిషేధించారు. అరలి పువ్వులకు బదులుగా తులసీ ఆకులు, తేచి (జంగిల్ జెరేనియం) మందార నైవేద్యంగా సమర్పించాలని సూచించారు. అలప్పుజ జిల్లాలో 24 ఏళ్ల మహిళ ప్రమాదవశాత్తు అరలి (ఒలియాండర్) ఆకులను నమిలి మింగడంతో ఆమె మృతి చెందింది.
ఈ క్రమంలో టావెన్కోర్ దేవస్వం బోర్డు, మలబార్ దేవస్వం బోర్డు నైవేద్యాలు, ప్రసాదాల్లో పువ్వుల వాడకాన్ని పరిమితం చేసి.. తద్వారా భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని నిర్ణయించాయి. అయితే, అరలి (కేరళలో అరలి అని పిలుస్తారు) ప్రమాదవశాత్తు అరలి ఆకులు తినడంతో వల్లే అనుమానిస్తుంటారు. ఆమె చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు (TBD) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ మాట్లాడు అరలి పువ్వులను నిషేధించినట్లు తెలిపారు. పువ్వుల్లో విషపూరితమైన లక్షణాలున్నాయన్న ఆందోళన నేపథ్యంలో వాటిని నిషేధించామన్నారు. దేవస్వం బోర్డు పరిధిలోని 1,248 ఆలయాల్లో నైవేద్యం, ప్రసాదాల్లో అరలి పువ్వులను వాడొద్దని సూచించామన్నారు.
ఇదిలా ఉండగా.. అలప్పుజాకు చెందిన సూర్య సురేంద్రన్ (24) యూకేలో నర్సుగా ఉద్యోగం పొందిన సూర్య సురేంద్రన్ కొచ్చిన్ ఏప్రిల్ 28న అంతర్జాతీయ విమానాశ్రయంలో వాంతులు చేసుకుంది. ఆ తర్వాత కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే, పోస్టుమార్టం నివేదికలో రక్తంలో విషపూరితమైన పదార్థం ఉన్నట్లు తేలిందని హరిపాడ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కే అభిలాష్ కుమార్ తెలిపారు. అరలి ఆకులు తీసుకోవడం వల్లే మా మరణించినట్లు భావిస్తున్నామన్నారు.
మృతురాలు తిరువల్లలోని వైద్యులకు అరలి ఆకులు తిని ఉమ్మవేసినట్లుగా చెప్పింది. ఆకులోని రసం శరీరంలోకి ఎళ్లి ఉంటుందని.. దాంతో గుండెపోటుకు దారి తీసిందని.. ఆమె మరణానికి మరే కారణం లేదన్నారు. రక్త నమూనాలను ల్యాబ్‌కి పంపించామని.. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. నెరియం ఒలియాండర్ని సాధారణంగా ఒలియాండర్.. కేరళలో అరలి అని పిలుస్తుంటారు. అయితే, ఎక్కువగా అలంకరణ కోసం విస్తృతంగా సాగు చేస్తుండగా.. అత్యంత విషపూరితమైన మొక్క. ఆకులు, కాండం, పువ్వులు సహా అన్ని భాగాలు తీవ్రమైన విష ప్రభావం కలిగించే శక్తివంతమైన కార్డియాక్ గ్లైకోసైడ్ను కలిగి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఒలియాండర్ విషపూరిత లక్షణాల్లో వికారం, వాంతులు, కడుపునొప్పి, అతిసారం, గుండెలయతప్పడం, తీవ్రమైన సందర్భాల్లో మరణం సంభవిస్తుంది. ఇండియా ఆయుర్వేద ఫార్మాకోపోయియా ప్రకారం.. ఒలియాండర్ మొక్క, వాటి భాగాలను ఆయుర్వేదంలో వివిధ చర్మ చికిత్సలకు వినియోగిస్తారు. విష ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాని ఉపయోగంపై హెచ్చరిస్తున్నారు.