IPL 2024 : పదిహేడో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. రాజస్థాన్ రాయల్స్‌పై గెలిస్తే14 పాయింట్లతో ప్లే ఆఫ్స్(Play Offs) రేసులో నిలుస్తుంది. ఈ సందర్బంగా చెపాక్ స్టేడియాని(Chepauk Stadium)కి విచ్చేసిన అభిమానులకు సీఎస్కే ఫ్రాంచైజీ ఓ సందేశం పంపింది. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ తర్వాత అందరూ స్టేడియంలోనే ఉండాలని కోరింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ కూడా పెట్టింది.
దాంతో, ఫ్యాన్స్ ఏం సర్ప్రైజ్ ఉంటుంది?, సీఎస్కే మేనేజ్మెంట్ ఏం చేయబోతోంది? అని బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు. మరికొందరేమో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా?, అందరికీ సీఎస్కే జెర్సీలను కానుకగా ఇస్తారా? అని చర్చించుకుంటుననారు.
🚨🦁 Requesting the Superfans to Stay back after the game! 🦁🚨
Something special coming your way! 🙌🥳#CSKvRR #YellorukkumThanks 🦁💛 pic.twitter.com/an16toRGvp
— Chennai Super Kings (@ChennaiIPL) May 12, 2024
ఐపీఎల్లో ఏకంగా ఐదు టైటిళ్లు గెలిచిన సీఎస్కేకు అభిమానుల మద్దతు ఎక్కువ. ఎక్కడ మ్యాచ్ జరిగినా ఎల్లో జెర్సీలతో స్టేడియాలు నిండిపోతాయి. అంతేకాదు ధోనీపై, చెన్నైపై అభిమానంతో ఒక తమిళ తంబీ ఏకంగా ఇల్లు మొత్తాన్ని పసుపు రంగుతో నింపేశాడు.
డిఫెండింగ్ చాంపియన్‌గా పదిహేడో సీజన్లో అడుగుపెట్టిన చెన్నై తొలి మ్యాచ్‌కు ముందే అభిమానులను ఆశ్చర్యపరిచింది. సీఎస్కేకు ఐదు ట్రోఫీలు అందించిన ధోనీ(MS Dhoni) సారథిగా వైదొలిగి తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad)ను ప్రకటించాడు. దాంతో, కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఆడిన చెన్నై ఈసారి పడుతూ లేస్తూ వస్తోంది. ప్రస్తుతం 6 విజయాలతో నాలుగో స్థానంలో ఉన్న గైక్వాడ్ సేనకు రాజస్థాన్ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ పోరులో విజయం సాధిస్తే.. 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే చాన్స్ ఉంది.