CSK vs RR : స్వల్ప ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో లేని రచిన్ రవీంద్ర(27) కుదురుకున్నట్టే కనిపించినా వికెట్ పారేసుకున్నాడు. అశ్విన్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 32 పరుగుల వద్ద చెన్నై మొదటి వికెట్ పడింది. డారిల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు.
మరో ఎండ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులతో ఆడుతున్నాడు. 4 ఓవర్లకు చెన్నై స్కోర్.. 34/1. సీఎస్కే విజయానికి ఇంకా 108 పరుగులు కావాలి.