Refrigerator care | మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఫ్రిడ్జ్ పేలిపోతుంది..!
Refrigerator care | ఇప్పుడు ఫ్రిడ్జ్ (రిఫ్రిజిరేటర్) లేని ఇళ్లు చాలా తక్కువ. దాదాపు 90 శాతానికి పైగా ఇళ్లలో ఫ్రిడ్జ్‌లు ఉన్నాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు, పానీయాలు పాడవకుండా ఉండటం కోసం ఈ ఫ్రిడ్జ్‌లను వినియోగిస్తారు. అయితే ఈ ఫ్రిడ్జ్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే పేలిపోయే ప్రమాదం ఉంది. ఫ్రిడ్జ్‌లు పేలిపోయి మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Refrigerator care : ఇప్పుడు ఫ్రిడ్జ్ (రిఫ్రిజిరేటర్) లేని ఇళ్లు చాలా తక్కువ. దాదాపు 90 శాతానికి పైగా ఇళ్లలో ఫ్రిడ్జ్‌లు ఉన్నాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు, పానీయాలు పాడవకుండా ఉండటం కోసం ఈ ఫ్రిడ్జ్‌లను వినియోగిస్తారు. అయితే ఈ ఫ్రిడ్జ్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే పేలిపోయే ప్రమాదం ఉంది. ఫ్రిడ్జ్‌లు పేలిపోయి మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్రిడ్జ్‌ను చాలా జాగ్రత్తగా మెయింటెయిన్ చేయాలి. ఫ్రిడ్జ్ పేలిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలా మెయింటెయిన్ చేయాలి
రిఫ్రిజిరేటర్ టెంపరేచర్‌ను ఎప్పుడు కూడా జీరోకి తగ్గించకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జ్ టెంపరేచర్‌ను జీరోకి తగ్గించినప్పుడు దాని కంప్రెషర్‌పై అవసరానికి మించి భారం పడుతుంది. అందువల్ల అది బాగా వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంది.
రిఫ్రిజిరేటర్‌ను ఆన్‌లో ఉంచి చాలా రోజుల వరకు దాని డోర్ ఓపెన్ చేయకపోతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దాని డోర్ తెరిచే ముందు పవర్‌ను ఆపేయాలి. ఆ తర్వాతే డోర్ ఓపెన్ చేయాలి. దీనివల్ల ఫ్రిడ్జ్ పేలిపోయే ప్రమాదం ఉండదు.
రిఫ్రిజిరేటర్లో ముఖ్యంగా కంప్రెషర్‌లో ఏదైనా లోపం ఉంటే దాన్ని కంపెనీ సర్వీస్ సెంటర్‌కు మాత్రమే తీసుకెళ్లాలి. ఎందుకంటే వాటి ఒరిజినల్ పార్ట్స్ అక్కడ మాత్రమే లభిస్తాయి. నాసిరకం పార్ట్స్ వినియోగిస్తే కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి పేలిపోయే ప్రమాదం ఉంది.
రిఫ్రిజిరేటర్లో ఐస్ గడ్డకట్టాలని టెంపరేచర్ తగ్గించి చాలాసేపు డోర్ తెరవకుండా ఉండకూడదు. గంటకు ఒకసారైనా డోర్ తెరిచే ప్రయత్నం చేయాలి. అందువల్ల టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది.
అదేవిధంగా విద్యుత్ హెచ్చుతగ్గులు ఉండే ప్రాంతాల్లో రిఫ్రిజిరేటర్‌ను అస్సలు ఉపయోగించకూడదు. దానివల్ల రిఫ్రిజిరేటర్ కంప్రెషర్‌పై ఒత్తిడిపడి పేలుడు సంభవించే ఛాన్స్ ఉంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

