IPL 2025 : టీ20 ఫార్మాట్ అంటే చాలు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. ఇక ఐపీఎల్ వచ్చిందంటే మనోడికి పండుగే. ఐపీఎల్ 18వ సీజన్లో తన మార్క్ విధ్వంసంతో అలరించిన సూర్య.. అత్యధిక పర్యాయాలు 25కు పైగా స్కోర్లతో రికార్డు నెలకొల్పిన విషయం తెలిసింది. క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)పై 44 రన్స్ కొట్టిన ఈ చిచ్చరపిడుగు మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్ బ్యాటర్ కాకుండా ఒక ఎడిషన్‌లో 700 ప్లస్ పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర పుస్తకాల్లోకెక్కాడీ మిస్టర్ 360. దాంతో. 9 ఏళ్లుగా డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
ఏ ఫార్మాట్లో అయినా ఓపెనర్లకు భారీ స్కోర్లు చేసే అవకాశం ఎక్కువ. కానీ, మూడో స్థానంలో బరిలోకి దిగిన సూర్య తనకు అవేమీ పట్టవని నిరూపిస్తూ పరుగుల వరద పారించాడు. 18వ ఎడిషన్‌లో వీరవిహారం చేసిన ఈ డాషింగ్ బ్యాటర్ 14 మ్యాచుల్లో 167.92 స్ట్రయిక్ రేటుతో 717 రన్స్‌తో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
They marched ahead like 5️⃣-time champs do 🙌
Mumbai Indians bow out but not before producing yet another 𝗠𝗜𝗴𝗵𝘁𝘆 campaign 💙#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile | @mipaltan pic.twitter.com/geDGNZcnO0
— IndianPremierLeague (@IPL) June 2, 2025
పదిహేను మ్యాచుల్లో 759 రన్స్ కొట్టిన గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ (Sai Sudarshan) ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే.. ఓపెనర్‌గా రాకుండానే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రన్స్ బాదిన ఆటగాళ్ల జాబితాలో మాత్రం సూర్యనే టాపర్.
1. సూర్యకుమార్ యాదవ్ – ఐపీఎల్ 2025 ఎడిషన్, 14 మ్యాచుల్లో 717 రన్స్.
2. ఏబీ డివిలియర్స్ – ఐపీఎల్ 2016 ఎడిషన్, 16 మ్యాచుల్లో 687 పరుగులు.
3. రిషభ్ పంత్ – ఐపీఎల్ 2018 ఎడిషన్, 14 మ్యాచుల్లో 684 రన్స్.
4. కేన్ విలియమ్సన్ – ఐపీఎల్ 2018 ఎడిషన్, 14 మ్యాచుల్లో 622 రన్స్.
5. సూర్యకుమార్ యాదవ్ – ఐపీఎల్ 2023 ఎడిషన్, 16 మ్యాచుల్లో 605 పరుగులు.
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)తో మ్యాచ్‌లో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సూర్య .. 11వసారి ఈ 25కు పైగా స్కోర్ నమోదు చేశాడు. దాంతో, ఐపీఎల్లో ఈ మైలురాయికి చేరువైన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడీ హిట్టర్. ఈ ముంబై చిచ్చరపిడుగు ధాటికి రాబిన్ ఊతప్ప రికార్డు బద్దలైంది.ఒకప్పుడు ఐపీఎల్ స్టార్‌గా పేరొందిన రాబిన్ ఊతప్ప 2014లో సుడిగాలిలా చెలరేగాడు.
काम पच्चीस+ है 😎
Surya Dada bole toh game over! 🔥#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #RRvMI pic.twitter.com/yHfR0ytyeT
— Mumbai Indians (@mipaltan) May 2, 2025
ఆ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడిన ఊతప్ప తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుసగా 10 మ్యాచుల్లో 25కు పైగా స్కోర్లతో రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత 10 సీజన్లు పూర్తి అయ్యాయి. కానీ, ఎవరూ ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు.