IPL 2025 : ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చతికిలపడుతోంది. 8 మ్యాచుల్లో రెండు రెండు విజయాలతో అట్టడుగున నిలిచింది. మ్యాచ్ విన్నర్లా నిలిచే ఆటగాడు ఒక్కరు కూడా సీఎస్కే స్క్వాడ్‌లో కనిపించడం లేదు. వాంఖడేలో ముంబై ఇండియన్స్ చేతిలో ధోనీ సేన చిత్తుగా ఓడిన నేపథ్యంలో ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా (Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవంబర్‌లో జరిగిన మెగా వేలం (Mega Auction)లో అత్యుత్తమ క్రికెటర్లను కొని ఉంటే సీఎస్కే పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండేదని రైనా అభిప్రాయపడ్డాడు.
ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సూపర్ కింగ్స్ జట్టు 18వ ఎడిషన్‌లో తేలిపోతోంది. స్వల్ప లక్ష్యాలను ఛేదించలేక.. భారీ స్కోర్లు చేయలేక అల్లాడుతోంది. దాంతో, ఆ జట్టుకు సుదీర్ఘ కాలం ఆడిన సురేశ్ రైనా వేలంలో చెన్నై యాజమాన్యం చేసిన పొరపాట్లను ప్రస్తావించాడు.
“I Think The CSK Coach or CSK Management Didn’t Had a Good Auction , There Were So Many Talented Players like Priyansh Arya and All . They Left Out Pant , Shreyas , KL Rahul & All . When Other Teams Play Then They Play So Aggressive with Intent . I’ve Never Seen Such Struggling… pic.twitter.com/S54FumxMPK
— Junaid Khan (@JunaidKhanation) April 21, 2025
‘నిరుడు దుబాయ్‌లో జరిగిన వేలంలో సీఎస్కే టీమ్ తెలివిగా వ్యవహరించలేదు. ఎంతోమంది ప్రతిభావంతులను వదిలేసింది. కుర్రాడు ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya)ను కొనాల్సింది. అంతేకాదు శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer), రిషభ్ పంత్, కేఎల్ రాహుల్.. వంటి అత్యుత్తమ ఆటగాళ్లను ఒకరిద్దరిని అయినా కొనాల్సింది. వేలంలో వీళ్లను సొంతం చేసుకొని ఉంటే 18వ ఎడిషన్‌లో చెన్నై ఆట మరోలా ఉండేది’ అని రైనా కామెంటరీ బాక్స్‌లో వెల్లడించాడు.
💔#MIvCSK pic.twitter.com/1R2kK6ThmZ
— Chennai Super Kings (@ChennaiIPL) April 20, 2025
మెగా వేలంలో సీఎస్కే టీమిండియా స్టార్లు అయిన శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేల్ రాహుల్‌లను కొనేందుకు ఆసక్తి చూపించలేదు. వీళ్లు ముగ్గురికి భారీ ధర చెల్లించాల్సి వస్తుందని కావొచ్చు.. వెనకంజ వేసింది. డెవాన్ కాన్వేను రూ.6.25 కోట్లు, రచిన్ రవీంద్రను రూ.4 కోట్లకు కొన్నది. రాహుల్ త్రిపాఠిని రూ.3.4 కోట్లకు, విజయ్ శంకర్‌ను రూ.1.20 కోట్లకు, సామ్ కరన్ కోసం రూ.2.40 కోట్లు వెచ్చించింది.17వ సీజన్లో కోల్‌కతాను విజేతగా నిలిపిన అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనేసింది. ఇక రిషభ్ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు పట్టేసింది లక్నో సూపర్ జెయింట్స్. కేల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది.