గట్టుప్పల్, ఏప్రిల్ 21 : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న సోయి అభివృద్ధిపై లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ముందు మూడు, వెనుక నాలుగు కార్లు వేసుకుని తిరగడం తప్పా నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవ చేశారు. మునుగోడు మండలంలోని కల్వకుంట్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్ధాపన చేసిండే తప్పా ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదన్నారు. మునుగోడును మున్సిపాలిటీ చేస్తున్న సంగతి ఏమైందినీ నిలదీశారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతానికి సోమవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను పార్టీ అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. కావునా పార్టీ శ్రేణులు కనీవిని ఎరుగని రీతిలో మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15 నెలలు గడిచినా హామీల అమలుకు పూనుకోకపోవడం లేదన్నారు. ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సింహ గర్జన పూరించే విధంగా కేసీఆర్ భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని రానున్న రోజుల్లో అధికారం మళ్లీ తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
6 గ్యారంటీలు అటే పోయాయి. ఫార్మా కంపెనీలు రద్దు చేస్తాను అన్నారు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో మళ్లీ ఆంధ్ర పాలన కొనసాగుతుందని, చంద్రబాబు చేతిలో సీఎం రేవంత్ రెడ్డి కీలుబొమ్మలా పని చేస్తున్నారన్నారు. అనంతరం బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్‌ను కూసుకుంట్ల ఆవిష్కరించారు. మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అవ్వారి గీతా శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గొరిగే సత్తయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండారు చంద్రయ్య, నాయకులు మద్ది ప్రవీణ్ కుమార్ రెడ్డి, కుండే వెంకటేశం, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Gattuppal : రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న సోయి అభివృద్ధిపై లేదు : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల