అమ్రాబాద్: జేఈఈ మెయిన్స్ ( JEE Mains ) ఫలితాల్లో నల్లమల్ల విద్యార్థికి ఆల్ ఇండియాలో 132వ ర్యాంకు ( Rank ) సాధించి జయకేతనం ఎగురవేశారు. వెనుకబడిన ప్రాంతమైన అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన ఆలేటి శ్రీను ( Alethi Srinu ) ఎలాంటి కోచింగ్ లేకుండా ర్యాంకు సాధించడం పట్ల నల్లమల్ల ప్రజలు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెం జిల్లాలోని కృష్ణవేణి త్రివేణి కళాశాలలో చదివిన తర్వాత ఎలాంటి కోచింగ్ లేకుండా మొదటిసారి ఆల్ ఇండియా లెవెల్ లో 132వ ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు అలివేలు, గెలువయ్య సంబరపడ్డారు. ర్యాంకు సాధించడం ఎంతో కష్టతరమైనప్పటికీ పట్టుదలతో, తల్లిదండ్రులు ఆశీర్వాదంతో చదివి ర్యాంకు సాధించానని శ్రీను తెలిపాడు .