లక్నో: భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నదని భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లపై యాసిడ్ పోశాడు. (Man Throws Acid On Wife, Daughters) భార్య, ఒక కుమార్తె స్వల్పంగా గాయపడగా మరో కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలిసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నిగోహి ప్రాంతానికి చెందిన రామ్ గోపాల్ తన భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్య, ఇద్దరు కూతుళ్లపై యాసిడ్ పోశాడు.
కాగా, యాసిడ్ దాడిలో భార్య, ఒక కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. మరో కుమార్తె తీవ్రంగా గాయపడింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. యాసిడ్ దాడిలో గాయడిన మహిళ, ఆమె కుమార్తెలను జిల్లా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు వారికి ప్రాణాపాయం లేదని పోలీస్ అధికారి తెలిపారు. భార్య, కుమార్తెలపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడు రామ్ గోపాల్‌తో పాటు యాసిడ్ అమ్మిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.