శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 29, 2020 , 11:58:35

చెన్నైకి మరో షాక్‌..ఐపీఎల్‌ నుంచి సురేశ్‌ రైనా ఔట్‌

చెన్నైకి మరో షాక్‌..ఐపీఎల్‌ నుంచి సురేశ్‌ రైనా ఔట్‌

దుబాయ్‌:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)  13వ సీజన్‌ కోసం సాధన మొదలెట్టేందుకు సిద్ధమవుతున్న   చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టుకు మరో షాక్‌ తగిలింది. చెన్నై సీనియర్‌ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా  ఐపీఎల్-2020 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. రైనా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని,  రాబోయే సీజన్‌కు అందుబాటులో ఉండడని టీమ్‌ సీఈవో కేఎస్‌ విశ్వనాథన్‌ ధ్రువీకరించారు. 

'సురేశ్‌ రైనా వ్యక్తిగత కారణాల వల్ల భారత్‌కు తిరిగొచ్చేశాడు. ఈ సీజన్‌ మొత్తానికి అతడు అందుబాటులో ఉండడు. ఈ సమయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సురేశ్‌ రైనాతో పాటు అతని  కుటుంబానికి పూర్తి మద్దతుగా ఉంటుందని' చెన్నై ఫ్రాంఛైజీ పేర్కొంది.  చెన్నై జట్టులో ఇప్పటికే 10 మంది సభ్యులకు కరోనా వైరస్‌ సోకినట్లు తెలిసింది. 


logo