IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మెగా వేలం కోసం సిద్ధమవుతోంది. ‘రైట్ టు మ్యాచ్’తో కలిపి ఆరుగురిని అట్టిపెట్టుకొనేందుకు బీసీసీఐ అవకాశం ఇవ్వడంతో ఎవరిని వదిలేయాలి? అనేదానిపై కసరత్తు మొదలెట్టింది. రిటైన్ చేసుకొనే ఆటగాళ్లపై హైదరాబాద్ యాజమాన్యం చాలా స్పష్టతతో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఈసారి రికార్డు ధరకు ఎవరిని రిటైన్ చేసుకోవాలో కూడా ఫ్రాంచైజీ ఓ నిర్ణయానికి వచ్చిందట.
అలాగని.. ఇంకెవరు జట్టును ఫైనల్ చేర్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) అనుకుంటే మీరు పొరబడినట్టే. గత రెండు సీజన్లలో అదరగొట్టిన చిచ్చరపిడుగు హెన్రిచ్ క్లాసెన్ (Henrich Klassen)కు రూ.23 కోట్లు చెల్లించేందుకు హైదరాబాద్ యాజమాన్యం సిద్ధ పడుతోంది. పదిహేడో సీజన్లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లను హైదరాబాద్ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకోనుంది. ముఖ్యంగా మినీ వేలంలో రికార్డు ధర పలికి జట్టు పగ్గాలు చేపట్టిన కమిన్స్, విధ్వంసక ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో పాటు హెన్రిచ్ క్లాసెన్‌లను ఆరెంజ్ జట్టు రిటైన్ చేసుకోనుంది.
Heinrich Klaasen, Pat Cummins, and Abhishek Sharma will remain with Sunrisers Hyderabad (SRH) for IPL 2025. Additionally, Travis Head and Nitish Kumar Reddy are also expected to be retained by the franchise, according to reports from ESPNcricinfo! pic.twitter.com/WJlCFDAiXn
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) October 16, 2024
ఇక బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌లో దంచికొట్టిన యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని సైతం అట్టిపెట్టుకొనే అవకాశముంది. అయితే.. రూ. 23 కోట్లతో క్లాసెన్‌ను రిటైన్ చేసుకోనున్న ఎస్ఆర్హెచ్.. కమిన్స్‌కు రూ.18 కోట్లు, ఓపెనర్ అభిషేక్ శర్మకు రూ.14 కోట్లు ముట్టజెప్పనుందని టాక్. మరోవైపు.. పదిహేడో సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠిలను వదలించుకునే పనిలో ఉంది హైదరాబాద్ ఫ్రాంచైజీ.
📺🍿 Box-office stuff from NKR! pic.twitter.com/A67i60dJJ3
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) October 9, 2024
డేవిడ్ వార్నర్ సారథ్యంలో చాంపియన్‌గా అవతరించిన హైదరాబాద్ జట్టు 17వ సీజన్లోనూ కప్పు కొట్టేలా కనిపించింది. లీగ్ దశ నుంచి దుమ్మురేపుతూ వచ్చిన కమిన్స్ సేన అనూహ్యంగా ఫైనల్లో చతికిలపడింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) బౌలర్లను ఎదుర్కోలేక 113 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని 10.3 ఓవర్లలోనే ఊదిపడేసిన కోల్‌కతా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.