IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ జట్టుకు కొత్త హెడ్‌కోచ్ వచ్చేశాడు. భారత మాజీ ఆటగాడు హేమంగ్ బదాని (Hemang Badani)ని ఢిల్లీ ప్రధాన కోచ్‌గా నియమించింది. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ స్థానంలో బదాని బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని గురువారం ఢిల్లీ ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఐపీఎల్లో టైటిల్ వేటలో తడబడుతున్న ఢిల్లీ 18వ సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. అందులో భాగంగానే వేలంలో గెలుపు గుర్రాలను కొనే పనిలో ఉంది ఆ జట్టు యాజమాన్యం. అంతకంటే ముందే పాంటింగ్‌పై వేటుతో ఖాళీగా ఉన్న హెడ్‌కోచ్ పదవిని భర్తీ చేసింది. అనుభవజ్ఞుడైన హేమంగ్ బదానిని కోచ్‌గా తీసుకుంది.
🚨𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓🚨
We’re delighted to welcome Venugopal Rao & Hemang Badani in their roles as Director of Cricket (IPL) & Head Coach (IPL) respectively 🫡
Here’s to a new beginning with a roaring vision for success 🙌
Click here to read the full story 👇🏻… pic.twitter.com/yorgd2dXop
— Delhi Capitals (@DelhiCapitals) October 17, 2024
అంతేకాదు.. భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly)కి కూడా ఢిల్లీ యాజమాన్యం షాకిచ్చింది. అతడిని ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ పదవి నుంచి తప్పిస్తూ.. తెలుగు ఆటగాడైన వేణుగోపాల్ రావు (Venugopal Rao)కు పగ్గాలు అందించింది. హెడ్‌కోచ్‌గా హేమంగ్ బదాని, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాల్ రావులకు హృదయపూర్వక స్వాగతం. విజయమో లక్ష్యంగా ఇక్కడితో కొత్త ఆరంభానికి అడుగు పడింది అని ఢిల్లీ ఫ్రాంచైజీ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించింది.
ఢిల్లీ కోచ్‌గా నియమితుడైన బదాని ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విదర్భకు ఆడాడు. దేశవాళీలో 121 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 6,758 పరుగులు సాధించాడు. భారత జట్టు తరఫున బదాని కెరీర్ సుదీర్ఘ కాలం సాగలేదు. అతడు కేవలం 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడంతే. అయితే.. 37 ఏండ్ల వయసులోనే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ బదాని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.