లక్నో: భరూచ్ హింసాకాండ నిందితులు నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఈ సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. (Bahraich Violence) ఉత్తరప్రదేశ్‌లోని భరూచ్‌లో అక్టోబరు 13న దుర్గా మాతా విగ్రహం నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య అల్లర్లు జరిగాయి. 22 ఏళ్ల రామ్ గోపాల్ మిశ్రాను కాల్చి చంపడంతో హింస చెలరేగింది. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేసిన పోలీసులు 55 మంది అనుమానితులను అరెస్టు చేశారు.
కాగా, మిశ్రాను కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడైన అబ్దుల్ హమీద్ కుమారులు, హత్య కేసులో నిందితులైన సర్ఫరాజ్, ఫహీమ్ నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో సర్ఫరాజ్, ఫహీమ్ కాళ్లకు గాయాలయ్యాయని చెప్పారు. వారిద్దరిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు వెల్లడించారు. పోలీస్ ఎన్కౌంటర్ సందర్భంగా ప్రధాన నిందితుడైన అబ్దుల్ హమీద్‌తో సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు.
మరోవైపు అక్టోబర్ 16 న తన తండ్రి, కుటుంబ సభ్యులను ప్రశ్నించడం కోసం ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లారని అబ్దుల్ హమీద్ కుమార్తె ఆరోపించింది. అప్పటి నుంచి వారి ఆచూకీ తెలియడం లేదని ఆమె వాపోయింది. ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు వారిని చంపుతారేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
बहराइच हिंसा में रुखसार ने इस बात की आशंका जताई थी कि उनके परिवार के लोगों का एनकाउंटर हो सकता है।
अब रुखसार के भाई सरफराज और एक युवक मोहम्मद तालिब को पुलिस एनकाउंटर में पैर में गोली मारी गयी । https://t.co/wkWRDEYr51 pic.twitter.com/nUmR69xDto
— Kavish Aziz (@azizkavish) October 17, 2024