IND vs NZ 1st Test : ప్రపంచ టెస్టు చాంపియన్ ఫైనల్‌కు ఓ సిరీస్ దూరంలో ఉన్న భారత జట్టు (Team India)కు ఊహించని షాక్. సొంత గడ్డపై బంగ్లాదేశ్‌పై 2-0తో సిరీస్ విజయం అనంతరం న్యూజిలాండ్ (Newzealand)ను ఓ ఆట ఆడుకుంటుందనుకున్న టీమిండియాకు మర్చిపోలేని ఓరోజు. చిన్నస్వామి స్టేడియంలో కివీస్ బౌలర్లు చెలరేగగా అనుభవజ్ఞులైన భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.
మ్యాట్ హెన్రీ(5/15), విలియం ఓరూర్కీ(3/22)ల ధాటికి ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారంటే.. మనోళ్ల ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డెవాన్ కాన్వే(91) మెరుపు అర్ధ శతకం బాదేయగా న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యం సాధించి తొలి టెస్టులో పటిష్ఠ స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సరికి రచిన్ రవీంద్ర(22), డారెల్ మిచెల్(14)లు క్రీజులో ఉన్నారు.
That will be Stumps on Day 2 of the 1st #INDvNZ Test!
New Zealand move to 180/3 in the first innings, lead by 134 runs.
See you tomorrow for Day 3 action.
Scorecard – https://t.co/FS97LlvDjY#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/ZvoDdxdb0O
— BCCI (@BCCI) October 17, 2024
స్వదేశంలో 18వ టెస్టు సిరీస్ విజయోత్సాహంతో ఉన్న టీమిండియా.. మరోవైపు శ్రీలంక చేతిలో చావు దెబ్బతిన్న న్యూజిలాండ్. ఇంకేముంది చిన్నస్వామి స్టేడియంలో భారత జట్టు దెబ్బకు కివీస్ కుదేలవ్వడం ఖాయం అనుకున్నారంతా. టాస్ గెలిచి ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేయాలనుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ అంచనా తప్పింది. తొలి సెషన్లో చూస్తుండగానే న్యూజిలాండ్ పేసర్లు చకచకా వికెట్లు పడగొట్టేశారు. సౌథీ సూపర్ బంతితో హిట్‌మ్యాన్‌ను బౌల్డ్ చేసి కివీస్‌కు శుభారంభమిచ్చాడు. ఆ తర్వాత.. వచ్చిన విరాట్ కోహ్లీ(0)ని కొత్త కుర్రాడు విల్ ఓ రూర్కీ(4/22) బోల్తా కొట్టించాడు.. ఆ వెంటనే సర్ఫరాజ్ ఖాన్(0)ను మ్యాట్ హెన్రీ(5/15) డకౌట్‌గా వెనక్కి పంపాడు.
Rohit, 2
Virat, 0
Sarfaraz, 0
Jaiswal, 13
Rahul, 0
Jadeja, 0
Ashwin, 0
Pant, 20
Bumrah, 1
Kuldeep, 246 ALL OUT! 😮 pic.twitter.com/fHWUamUvL4
— ESPNcricinfo (@ESPNcricinfo) October 17, 2024
వరుసగా ముగ్గురు ఔట్.. స్టేడియంలో అంతా నిశబ్దం. ఆ సమయంలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(13), రిషభ్ పంత్(20)లు నాలుగో వికెట్‌కు 21 పరుగులు జోడించి ఆశలు రేపారు. కానీ, హెన్రీ, రూర్కీలు లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్‌తో యశస్వీ, పంత్‌ను పెవిలియన్ పంపి.. టీమిండియాను కోలుకోలేని దెబ్బతీశారు. ఈ ఇద్దరి ధాటికి ఏకంగా ఐదుగురు సున్నా చుట్టేశారు. ఆఖర్లో కుల్దీప్ యాదవ్(4) వికెట్ తీసిన హెన్రీ ఐదో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అంతే.. సొంతగడ్డపై టీమిండియా తొలిసారి 46 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత్‌ను 46కే కుప్పకూల్చిన కివీస్‌కు ఓపెనర్ డెవాన్ కాన్వే(91), టామ్ లాథమ్(14)లు అదిరే ఆరంభమిచ్చారు. మనోళ్లు తడబడిన చోట బుమ్రా, సిరాజ్‌లను సమర్దంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరూ కివీస్ స్కోర్ బోర్డును ఉరికించారు. కుల్దీప్ యాదవ్ ఓవర్లో లాథమ్ ఎల్బీగా ఔటైనా కాన్వే మాత్రం జోరు తగ్గించలేదు. విల్ యంగ్(33)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కాన్వేను అశ్విన్ బౌల్డ్ చేశాడు.
Ravindra Jadeja 🤝 Kuldeep Yadav#TeamIndia with a breakthrough 🙌 🙌
Match Updates ▶️ https://t.co/8qhNBrrtDF#INDvNZ | @imjadeja | @imkuldeep18 | @IDFCFIRSTBank pic.twitter.com/Qr8THgdiqG
— BCCI (@BCCI) October 17, 2024
ఆఖరి సెషన్లో రచిన్ రవీంద్ర(22 నాటౌట్), డారిల్ మిచెల్(14 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దాంతో, తొలి రోజు ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి.. 134 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పట్టు సాధించాలంటే మూడో రోజు బుమ్రా, కుల్దీప్, అశ్విన్‌లు చెలరేగాల్సిందే.