IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అడ్వైజ్ ఇచ్చాడు. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకోవద్దంటూ మరో ఆటగాడి పేరును ప్రతిపాదించాడు. సీఎస్కే ధోనిని క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించాలని.. ఐదు ప్రైమరీ రిటెన్షన్లలో ధోనీని ఎంచుకోవాలని అశ్విన్ సూచించాడు. ఓ ట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి మెగా వేలానికి ముందు ధోనీని తక్కువ మొత్తానికి రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావిస్తున్నది. ఈ కేవలం ధోనీ ఈ 2025 సీజన్‌కు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. 2026 సీజన్‌కు దాదాపు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువే. ఈ క్రమంలో జట్టును పటిష్టంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నది.
ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లైన రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీష పతిరనాన, శివం దూబే, సమీర్ రిజ్వీని మాత్రమే రిటైన్ చేసుకోవాలని నిర్ణయించిందినట్లు తెలుస్తున్నది. రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. సమీర్ రిజ్వీని రూ.4కోట్లకు ఉంచుకోవాలని తాను అనుకోవడం లేదని.. రూ.4కోట్లకు ఆడేందుకు ఒప్పుకుంటాడో లేదో తెలియదని పేర్కొన్నారు. 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు జరిగిన వేలంలో రిజ్వీని రూ.8.4కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసింది. గత సీజన్లో పెద్దగా రాణించలేకపోయాడు. 118 స్ట్రయిక్ రేట్‌తో ఎనిమిది మ్యాచుల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, యూపీ టీ20 లీగ్‌లో అతని ఫామ్‌ను ప్రశంసిస్తూ సీఎస్కే జట్టుకు అడ్వైజ్ ఇచ్చారు.
పేయర్లు చాలామంది అందుబాటులో ఉన్నారని.. దాంతో రిజ్వీ ధర పెద్దగా పెరగదని చెప్పాడు. రిజ్వీ దేశవాలీ టోర్నీల్లో రాణిస్తున్నాడని.. అతనుడు వెరేలెవల్లో ఆడుతున్నాడన్నాడు. అతడో పవర్ హిట్టర్ అని చెప్పాడు. షారుక్ ఖాన్, అభినవ్ మనోహర్, ధ్రువ్ జురెల్ కేటగిరిలోకి వస్తాడన్నారు. ఇదిలా ఉండగా.. ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం నుంచి ఇంటర్నేషన్ క్రికెట్ ఆడని భారత ఆటగాళ్లు ‘అన్క్యాప్డ్’గా కొనసాగించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల నిర్ణయించింది. దాంతో ఐదుసార్లు సీఎస్కేను విజేతగా నిలిపిన ధోనీని రూ.4కోట్లకు అట్టిపెట్టుకునే అవకాశం సీఎస్కే దక్కనున్నది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టీమిండియా స్పిన్నర్ సూలహా ఇచ్చాడు.