Jai Hanuman Movie | ఈ ఏడాది హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma). తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడమే కాకుండా వరల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలావుంటే ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ‘జై హనుమాన్’ అంటూ ఈ సినిమా రానుండగా.. ఇప్పటికే ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ చిత్రం.
అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా కనిపించబోయేది ఎవరంటూ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మొదట హనుమంతుడిగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కనిపించబోతున్నట్లు.. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ పాత్రకు సంబంధించి మరోక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో హనుమంతుడిగా కన్నడ నటుడు రిషబ్ షెట్టి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న రిషబ్ షెట్టి ప్రస్తుతం దీనికి కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అయితే జై హనుమాన్కు రిషబ్ షెట్టి సరిగ్గా సరిపోతాడని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు టాక్.