Sunil Gavaskar : ఐపీఎల్ 16వ సీజన్ల్(IPL 2023)లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఎలిమినేటర్(Eliminator match) మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ఢీ కొంటున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగనున్న ఈ గేమ్‌పై ఇప్పుడు అందరి కళ్లు ఈ మ్యాచ్‌పైనే నిలిచాయి. ఈ కీలక పోరులో లక్నోకు ముంబై చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) నుంచి ముప్పు పొంచి ఉందని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) అన్నాడు. ముంబై జట్టు విజయంలో సూర్య కీలక పాత్ర పోషిస్తాడని ఈ లెజెండరీ ప్లేయర్ అభిప్రాయపడ్డాడు.
‘సూర్య.. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. తనదైన షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ప్లే ఆఫ్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబైకి అతను కీలకం కానున్నాడు. అయితే.. స్లో, టర్నింగ్ పిచ్‌లకు తగ్గట్టుగా అతను తన ఆటతీరును మలచుకోవాల్సి ఉంది. ఎందుకంటే.. రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో చెన్నైలోనే జరగనున్నాయి’ అని ఈ దిగ్గజ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్లో తొలి సెంచరీ బాదిన సూర్య(101 నాటౌట్)
ఐపీఎల్ పదహారో సీజన్లో సూర్యకుమార్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు. మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్‌గా మాజీలచే కితాబు అందుకున్న సూర్య సీజన్ ఆరంభంలో తడబడ్డాడు. ఒక్కసారి ఫామ్ అందుకున్నాక ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. వరుస హాఫ్ సెంచరీలతో ముంబై విజయాల్లో భాగమయ్యాడు. అంతేకాదు బలమైన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై శతకం సాధించాడు. దాంతో, రోహిత్ సేన గుజరాత్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్లో సూర్య 14 ఇన్నింగ్స్‌ల్లో185.14 స్ట్రైక్ రేటుతో 511 రన్స్ కొట్టాడు. వీటిలో 4 అర్ధ శతకాలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సూర్య చెలరేగితే లక్నోకు కష్ట కాలమే.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పదోసారి ఐపీఎల్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. నిన్న రాత్రి చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్ 1 గేమ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 12 సార్లు చెన్నైని ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లిన అతను క్వాలిఫైయర్ 1లో తన అనుభవాన్నంతా ఉపయోగించాడు. పెద్దగా అనుభవం లేని బౌలింగ్ దళంతో ఈ మిస్టర్ కూల్ పెద్ద మ్యాజిక్ చేశాడు. అనామకులను ఆయుధాలుగా ప్రయోగించి ఫలితం సాధించాడు.
పదోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టిన చెన్నై