IPL 2023: ధోనీ మైండ్‌గేమ్.. హార్ధిక్ ప్యాండా ఔట్.. వీడియో
IPL 2023:ధోనీ వేసిన ట్రాప్‌లో హార్దిక్ చిక్కాడు. ఐపీఎల్ క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో.. ధోనీ మైండ్ గేమ్‌కు పాండ్యా తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. హార్దిక్ వికెట్ కోసం ఫీల్డింగ్ మార్చిన ధోనీ ప్లాన్ వర్కౌట్ అయ్యింది.
చెన్నై: ఐపీఎల్ 2023(IPL 2023) క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో చెన్నై జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వికెట్‌ను .. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చాలా తెలివిగా దక్కించుకున్నాడు. బ్యాటింగ్ కోసం హార్దిక్ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు.. ధోనీ తన ఫీల్డింగ్ పొజిషన్‌ను మార్చేశాడు. గుజరాత్ కెప్టెన్ హార్దిక్‌ను తన మైండ్‌గేమ్‌తో ధోనీ కన్ఫ్యూజ్ చేశాడు. చివరకు ధోనీ వేసిన ట్రిక్కులో.. హార్దిక్ ట్రాప్ అయ్యాడు.
తొలి 5 ఓవర్లు పేసర్లను వాడుకున్న ధోనీ.. ఆ తర్వాత స్పిన్నర్ మహేశ్ తీక్షణను రంగంలోకి దింపాడు. పవర్‌ప్లేలో చివరి ఓవర్ వేసిన తీక్షణ బౌలింగ్‌లో హార్డిక్ కట్ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే ఆ బంతిని నేరుగా వెళ్లి జడేజా చేతుల్లో పడింది. నిజానికి ఆ బంతి వేయడానికి ముందు బ్యాక్వర్డ్ స్క్వేర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజాను.. చాలా చాకచక్యంగా బ్యాక్వర్డ్ పాయింట్‌కు తీసుకువచ్చాడు ధోనీ. అయితే భారీ కట్ షాట్‌కు ప్రయత్నించిన హార్దిక్ .. జడేజాకు నేరుగా క్యాచ్ ఇచ్చేశాడు. హార్దిక్‌ను ట్రాప్ చేసిన ధోనీ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించి ఐపీఎల్ ఫైనల్లోకి వెళ్లింది. హార్దిక్ ఔటైన వీడియో ఇదే.
👀 Dhoni moved a fielder to the off-side a ball prior to Hardik getting dismissed! #GTvCSK #TATAIPL #Qualifier1 #IPLonJioCinema pic.twitter.com/oJow2Vp2rj
— JioHotstar Reality (@HotstarReality) May 23, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

