Sunil Gavaskar : భారత జట్టు భావి కెప్టెన్, రోహిత్ శర్మ (Rohit Sharma) వారసుడు ఎవరు? అనే విషయమై కొన్నాళ్లుగా క్రికెట్ అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ఈ ప్రశ్నకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు వన్డే కెప్టెన్సీ అప్పగించాలని అతను అభిప్రాయపడ్డాడు. ‘కెప్టెన్‌గా హార్దిక్‌కు జట్టు మీద పూర్తి నియంత్రణ ఉంది. అతను టీమ్‌ను చక్కగా నడిపించగలడు.
అందుకని స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ తర్వాత అతడిని టీమిండియా కెప్టెన్‌గా ప్రకటించాలి. ముంబైలో జరగనున్న మొదటి వన్డేలో భారత్ గెలిస్తే, హార్దిక్‌పై భావి కెప్టెన్‌గా ముద్ర వేయాల’ని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో మార్చి 17న జరిగే తొలి వన్డేకు రోహిత్ దూరమయ్యాడు. దాంతో, పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
టీ20 కెప్టెన్‌గా పాండ్యా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేకుండానే న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలో పాండ్యా టీ20 సిరీస్‌లు గెలిచాడు. అంతేకాదు స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌పై పొట్టి సిరీస్‌లో జట్టును విజేతగా నిలిపాడు. దాంతో, రోహిత్ వారసుడు దొరికేశాడని మాజీలు పాండ్యాను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లోనూ పాండ్యా సారథిగా సక్సెస్ అయ్యాడు. గత సీజన్లోఅతని కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ (Gujarat Titans) చాంపియన్‌గా అవతరించింది. ఆరంగేట్రంలోనే గుజరాత్ కప్పు అందుకోవడంలో పాండ్యా కీలక పాత్ర పోషించాడు. పదహారో సీజన్ ఐపీఎల్ మార్చి 32న మొదలు కానుంది. ఆరంభ పోరులో గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.