Virat Kohli | నార్వే డ్యాన్స్ గ్రూప్‌తో స్టెప్పులేసిన కోహ్లీ.. వీడియో చూడాల్సిందే
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ముగియడంతో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రిలాక్స్ అవుతున్నాడు. అఖరిదైన అహ్మదాబాద్ టెస్టులో శతకం బాదిన అతను ఈరోజు నార్వేకు చెందిన Quick Style డ్యాన్స్ గ్రూప్‌తో స్టెప్పులేశాడు.
Virat Kohli : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ముగియడంతో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రిలాక్స్ అవుతున్నాడు. అఖరిదైన అహ్మదాబాద్ టెస్టులో శతకం బాదిన అతను ఈరోజు నార్వేకు చెందిన డ్యాన్స్ గ్రూప్‌తో స్టెప్పులేశాడు. అంతేకాదు వాళ్లతో కలిసి ఫొటోలు కూడా దిగాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. నార్వే దేశానికి చెందిన క్విక్ స్టైల్ డ్యాన్స్ (Quick Style) గ్రూప్‌తో దిగిన ఫొటోలను కోహ్లీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ఈ రోజు ముంబైలో నేను ఎవరిని కలిశారో చెప్పుకోండి చూద్దాం..!’ అని క్యాప్షన్ జత చేశాడు.
ఈ హిప్ – హప్ డ్యాన్స్ గ్రూప్‌తో విరాట్ ఫన్నీ వీడియో చేశాడు. అందులో ఒక గ్రూప్ సభ్యుడు క్రికెట్ బ్యాట్‌ను పరిశీలిస్తుంటారు. అంతలోనే కోహ్లీ ఎంటర్ అవుతాడు. అతడిని బ్యాట్ తీసుకుని ఎలా షాట్ ఆడాలి? అనేది వివరిస్తాడు. మిగతా గ్రూప్ సభ్యులు, కోహ్లీ ‘ఇష్క్ హో గయా’ (Ishq Ho Gaya ) పాటకు స్టెప్పులేస్తారు. ఈ గ్రూప్ ఇంతకుముందు ‘కాలా చెష్మా, బార్ బార్ దేఖో’ వంటి బాలీవుడ్ పాటలను ఆలపించిన విషయం తెలిసిందే. కోహ్లీ, క్విక్ స్టైల్ గ్రూప్ డాన్స్ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
మూడేళ్ల నిరీక్షణకు తెర
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో కోహ్లీ చెలరేగాడు. టెస్టుల్లో దాదాపు మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ శతకం బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఛేజ్ మాస్టర్ టెస్టు ఫార్మాట్లో 2019 నవంబర్‌లో సెంచరీ కొట్టాడు. గత ఏడాది ఫామ్ అందుకున్న కోహ్లీ వరుస సిరీస్‌లలో దుమ్మురేపుతున్నాడు. ఆసియా కప్‌తో మొదలు.. బంగ్లాదేశ్, శ్రీలంక సిరీస్‌లలో ఈ స్టార్ ప్లేయర్ మూడంకెల స్కోర్ సాధించాడు.
ఇవి కూడా చదవండి
kolkata test 2001 | లక్ష్మణ్ – ద్రవిడ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌కు నేటితో 22 ఏళ్లు
Sunil Gavaskar | డబ్ల్యూటీసీ ఫైనల్లో కీపర్‌గా భరత్ వద్దు.. వీళ్లలో ఒకరిని తీసుకోవాలి : గవాస్కర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

