FIH Pro League : యూరప్ గడ్డమీద జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల జట్టు నిరీక్షణ ఫలించింది. వరుసగా ఆరు పరాజయాలకు చెక్ పెడుతూ హర్మన్‌ప్రీత్ సింగ్ సేన బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియంపై 4-3తో గెలుపొందింది. ఆతిథ్య జట్టుతో ఉత్కంఠగా సాగిన పోరులో స్ట్రయికర్ సుఖ్జీత్ సింగ్ (Sukhjeet Singh) రెండు గోల్స్‌తో రాణించగా.. అమిత్ రొహిదాస్ ఒక గోల్‌తో మెరిశాడు. దాంతో, లీగ్‌ను టీమిండియా చిన్నపాటి సంతృప్తితో ముగించనుంది. అయితే.. మహిళల జట్టు మాత్రం బెల్జియం చేతిలో 0-2తో చిత్తుగా ఓడింది.
హాకీ ప్రో లీగ్‌లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా చేతిలో రెండుసార్లు ఓడిన భారత జట్టు.. ఆదివారం పట్టుదలగా ఆడింది. తొలి అర్ధ భాగం 8 వ నిమిషంలో బెల్జియం ఆటగాడు అర్థర్ డి స్లూవర్ గోల్ కొట్టాడు. వందో మ్యాచ్ ఆడుతున్న భారత స్ట్రయికర్ సుఖ్జీత్ 21 నిమిషంలో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపడంతో స్కోర్లు సమం అయ్యాయి.
Harmanpreet returns. India wins. 🇮🇳🔥
Back from injury, Sarpanch saab scored last-minute penalty stroke and had a hand in 2 other goals as India beat Belgium🇧🇪 for a first win 8 matches.#Hockey #FIHProLeague pic.twitter.com/iOI534Wgtw
— Khel Now (@KhelNow) June 22, 2025
అయితే .. 34 వ నిమిషంలో థిబ్యూ స్టాక్బ్రొయెక్ గోల్ చేసిన ఆనందంలో ఉన్న బెల్జియానికి సుఖ్జిత్ షాకిస్తూ రెండో గోల్ అందించాడు. అనంతరం 41 నిమిషంలో ప్రత్యర్థి గోల్ చేయగా..అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ కీలక గోల్స్‌తో జట్టు అద్భుత విజయంలో భాగమయ్యారు.