MLA Jagadish Reddy | తనకు విద్యాబుద్ధులు నేర్పిన చిన్ననాటి గురువు బత్తినేని విశ్వనాథం మాస్టారును మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్లో గల వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని, వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి.. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాసేపు వారితో తాను చదువుకున్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా ముచ్చటించారు.