IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో పట్టుదలగా ఆడుతున్న కేఎల్ రాహుల్(90) కీలక ఇన్నింగ్స్‌కు తెరపడింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(90 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకునే పనిలో ఉన్న అతడిని బెన్ స్టోక్స్ వెనక్కి పంపాడు. ఎల్బీగా ఔట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. దాంతో, మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్(2 నాటౌట్) జతగా గిల్ స్కోర్ బోర్డును నడిపిస్తున్నడు. భారత్ స్కోర్.. 191/3. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 120 పరుగులు వెనకబడి ఉంది.
అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో కీలకమైన మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు పోరాడుతోంది. నాలుగో రోజు ఆఖరి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న కెప్టెన్ గిల్(90 నాటౌట్), కేఎల్ రాహుల్(90)లు వికెట్ పడనీయలేదు. ఓపికగా ఆడిన ఈ ఇద్దరూ 173 పరుగుల భాగస్వామ్యంతో డ్రాపై అంచనాలు పెంచారు. అయితే.. ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు బెన్ స్టోక్స్ ఊహిచని షాక్ ఇచ్చాడు. లో బౌన్స్ అయిన బంతితో రాహుల్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు.
Who else but Ben Stokes 🔥 pic.twitter.com/CBks8MaTCu
— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2025
తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్(150), బెన్ స్టోక్స్(141) విధ్వంసక శతకాలతో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లు తడబడిన చోట రన్ ఫెస్ట్ చేసుకున్న ఆతిథ్య జట్టు.. 311 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభంలోనే క్రిస్ వోక్స్ ధాటికి మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. వరుస బంతుల్లో యశస్వీ జైస్వాల్(0), సాయి సుదర్శన్(0)లను డకౌట్ చేసి.. ఇంగ్లండ్‌ను జోష్‌లో నింపాడు. అదే ఉత్సాహంతో మరో రెండు వికెట్లు తీయాలనుకున్న.. స్టోక్స్ బృందం ఆశలపై రాహుల్, గిల్ సమయోచిత బ్యాటింగ్‌తో నీళ్లు చల్లారు.