Raikal | రాయికల్, జులై 27 : కలిసి చదువుకున్న మిత్రుడు గుండె పోటుతో చనిపోగా అతడి కుటుంబానికి తోటి మిత్రులు అండగా నిలిచారు. రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన పెగ్గర్ల శ్రీధర్ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు.
శ్రీధర్ గుండె పోటుతో చనిపోవడంతో అతడి కుటుంబం పడుతున్న ఇబ్బందులను చూసి చిన్ననాటి మిత్రులు గతవారం (1999-2000 బ్యాచ్)ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని, శ్రీధర్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి, వారి పిల్లలకు ఏదైనా చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నారు. మిత్రులందరూ ఏకమై రూ.20వేలు నగదును వారి పిల్లలకు ఆదివారం అందించారు. ఈ కార్యక్రమంలో1999-2000 బ్యాచ్ మిత్రులు పాల్గొన్నారు.