IND vs ENG : సిరీస్లో కీలకమైన నాలుగో టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో రోజు తొలి సెషన్లోనే రెండు కీలక కోల్పోయింది. తొలి రోజు నుంచి క్రీజులో పాతుకుపోయిన శార్దూల్ ఠాకూర్(41) అద్భుత పోరాటాన్ని స్టోక్స్ ముగించాడు. కట్ చేయగా బంతిని డకెట్ డైవ్ చేస్తూ ఒడిసిపట్టుకున్నాడు. దాంతో.. 314 వద్ద ఆరో వికెట్ పడింది. జట్టును ఆదుకునేందుకు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (38) కుంటుతూనే బ్యాటింగ్కు వచ్చాడు. వాషింగ్టన్ సుందర్(17)కు జతగా కీలక భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నాడు పంత్. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 315-6.
భారత మిడిలార్డర్ పట్టుదలను ప్రదర్శిస్తోంది. ప్రధాన బ్యాటర్లు విఫలమైనా.. మేమున్నామంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు శార్థూల్ ఠాకూర్(41), వాషింగ్టన్ సుందర్(17)లు గోడలా నిలిచి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. తొలి సెషన్ మొదలైన కాసేపటకే ఆర్చర్ భారత్కు షాకిచ్చాడు. రవీంద్ర జడేజాను ఔట్ చేసి ఆతిథ్య జట్టుకు బ్రేకిచ్చాడు. స్లిప్ చేతికి చిక్కడంతో ఐదో వికెట్ పడింది. ఆ తర్వాత సుందర్ జతగా శార్ధూల్ సమయోచితంగా ఆడాడు.
Jofra Archer makes the perfect start to Day 2!
(via @englandcricket) #ENGvIND pic.twitter.com/0wPGHtvBlx
— ESPNcricinfo (@ESPNcricinfo) July 24, 2025
ఇంగ్లండ్ బౌలర్లు బుల్లెట్ బంతులతో విరుచుకుపడుతున్నా ఈ ఇద్దరూ వికెట్ మాత్రం ఇవ్వలేదు. ఏ ఒక్క చెత్త షాట్ కూడా ఆడకుండా.. సహనం కోల్పోకుండా ఆడుతున్న వీళ్లు ఆరో వికెట్కు 48 రన్స్ జోడించారు. అయితే.. స్టోక్స్ ఓవర్లో శార్దూల్ బంతిని కట్ చేయగా.. డకెట్ ఎడమవైపు డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఆదుకునేందుకు పంత్ క్రీజులోకి వచ్చాడు. పాదం నొప్పిని భరిస్తూనే అతడు కుంటుతూ మైదానంలోకి వస్తుంటే స్టేడియంలోని ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో కొడుతూ స్వాగతం పలికారు.
Here comes Rishabh Pant…
A classy reception from the Emirates Old Trafford crowd 👏 pic.twitter.com/vBwSuKdFcW
— England Cricket (@englandcricket) July 24, 2025