BCCI : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో తలపడుతున్న భారత జట్టు (Team India) మరోమారు ఆ దేశం వెళ్లనుంది. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా.. వచ్చే ఏడాది పొట్టి వరల్డ్ కప్ ముగిశాక ఇంగ్లండ్ (England)తో వైట్ బాల్ సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం ధ్రువీకరించింది. ఇరు జట్ల మధ్య జూలైలో మొదలు కాబోయే టీ20, వన్డే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.
వచ్చే ఏడాది భారత జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేల కోసం ఇంగ్లండ్ వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య జూలై 1న డర్హం వేదికగా తొలి టీ20తో సిరీస్ షురూ కానుంది. ఓల్డ్ ట్రఫోర్డ్‌లో జూలై 4న రెండో మ్యాచ్, మూడో టీ20 ట్రెండ్ బ్రిడ్జ్‌లో.. బ్రిస్టల్‌లో జూలై 7న నాలుగో మ్యాచ్ జరుగనుంది. చివరిదైన ఐదో టీ20 (జూలై 11)కి సౌతాంప్టన్ వేదిక కానుంది.
5⃣ T20Is. 3⃣ ODIs
📍 England
Fixtures for #TeamIndia‘s limited over tour of England 2026 announced 🙌#ENGvIND pic.twitter.com/Bp8gDYudXW
— BCCI (@BCCI) July 24, 2025
అనంతరం రెండు రోజుల విరామం తర్వాత వన్డే సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ ఎదురుపడనున్నాయి. ఇరుజట్ల మధ్య జూలై 14న వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. జూలై 16న కార్డిఫ్‌లో రెండో వన్డే, లార్డ్స్ మైదానంలో మూడో వన్డే జూలై19న నిర్వహించనున్నారు.
మరి ఈ పర్యటనకు సీనియర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లను ఎంపిక చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన ఈ దిగ్గజ ఆటగాళ్లు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. పైగా వన్డే సారథిని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు వన్డే సిరీస్ జట్టు కూర్పులో ఎవరెవరు ఉంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.
కోహ్లీ, రోహిత్