IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో చిన్నగా మొదలైన చినుకులు ఒక్కసారిగా పెద్దవి కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు. వాన తగ్గడానికి సమయం పట్టేలా ఉండడంతో లంచ్ బ్రేక్ ప్రకటించారు. భోజన విరామానికి వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(39 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(20 నాటౌట్)లు అజేయంగా నిలిచారు. టీమిండియా స్కోర్.. 321-6.
ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో భారత ఆటగాళ్లు అసమాన పోరాటం కనబరుస్తున్నారు. నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతున్న ఇంగ్లండ్ బౌలర్లను కాచుకొని క్రీజులో నిలిచి స్కోర్ 320 దాటించారు. తొలి సెషన్లో ఆదిలోనే రవీంద్ర జడేజా(20) ఔటైనా.. మేమున్నామంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు శార్థూల్ ఠాకూర్(41), వాషింగ్టన్ సుందర్(20 నాటౌట్)లు. ఇద్దరూ గోడలా నిలిచి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
Here comes Rishabh Pant…
A classy reception from the Emirates Old Trafford crowd 👏 pic.twitter.com/vBwSuKdFcW
— England Cricket (@englandcricket) July 24, 2025
తొలి సెషన్ మొదలైన కాసేపటకే ఆర్చర్ భారత్‌కు షాకిచ్చాడు. జడేజాను ఔట్ చేసి ఆతిథ్య జట్టుకు బ్రేకిచ్చాడు. స్లిప్‌లో బ్రూక్ చేతికి జడ్డూ చిక్కడంతో 314 వద్ద ఐదొ ఓవికెట్ పడింది. ఆ తర్వాత సుందర్ జతగా శార్ధూల్ సమయోచితంగా ఆడాడు. ఆరో వికెట్‌కు దాదాపు (48 రన్స్) హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జంటను విడదీసి స్టోక్స్ ఇండియాను మరింత కష్టాల్లోకి నెట్టాడు. అయితే.. జట్టును ఆదుకునేందుకు పంత్ క్రీజులోకి వచ్చాడు. పాదం నొప్పిని భరిస్తూనే అతడు కుంటుతూ మైదానంలోకి వస్తుంటూ స్టేడియంలోనిప్రేక్షకులు చప్పట్లతో కొడుతూ స్వాగతం పలికారు. కాసేపటికే వర్షం మొదలవ్వగా.. లంచ్ బ్రేక్ సమయానికి గిల్ సేన 6 వికెట్ల నష్టానికి 321 రన్స్ చేసింది.