ఖమ్మం రూరల్, జూలై 24 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర ఎంతో కీలకమని ఆ పార్టీ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. గురువారం ఎదులాపురం మున్సిపాలిటీ సెంటర్లో కేటీఆర్ జన్మదిన వేడుకలను పట్టణాధ్యక్షుడు బానోత్ మోహన్, మాజీ ఎంపీటీసీ బానోత్ కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిపెట్టారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ.. కేటీఆర్ ముందుచూపుతో ఐటీ పరిశ్రమ హైదరాబాద్‌తో పాటు అనేక జిల్లా కేంద్రాల్లో సైతం విస్తరించిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పీరా వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ దుర్గయ్య, సొసైటీ మాజీ చైర్మన్ లక్ష్మణ్ నాయక్, నాయకులు ముత్యం కృష్ణారావు, బానోత్ వీరన్న, రమేశ్, అక్కినపల్లి వెంకన్న, వెంపటి ఉపేందర్, శీలం రవి, కనకయ్య, మేకల ఉదయ్, తరుణ్, వీరభద్రం, గిరి, రవి పాల్గొన్నారు.