Dhup Singh Thanda | మెదక్ రూరల్, జూలై 24 : మూడు రోజుల నుండి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు మారుమూల గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో హవేలి ఘన్ పూర్ మండల కేంద్రానికి వచ్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు.
దూప్ సింగ్ తండా వాగు వర్షాల సమయంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ వంతెన నిర్మించాలని ఈ ప్రాంత గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ వారి గోస పట్టించుకోవడం లేదు.
ప్రతీ ఏటా వర్షాకాలంలో వర్షాలు కురిస్తే ఈ మార్గంలో గిరిజనులకూ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో గిరిజనులు వాగు దాటి ప్రమాదకరంగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. తండా ప్రజల ఇబ్బందులను గుర్తించి పాలకులు, అధికారులు వాగుపై వంతెనను పూర్తిగా నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Srisailam Temple | శ్రీశైలం మల్లన్న ఆలయానికి 27రోజుల్లో రూ.4.17కోట్ల ఆదాయం..!
Ramavaram : జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చు : జీఎం షాలెం రాజు
KTR | తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం కేటీఆర్ : ఎమ్మెల్యే కొనింటి మానిక్ రావు