Srilanka | డిసిల్వాకు టెస్టు పగ్గాలు .. అఫ్గనిస్థాన్‌తో ఏకైక మ్యాచ్‌లో ముగ్గురు కొత్త కుర్రాళ్లు
Srilanka : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC 2023-25)లో వెనకబడిన శ్రీలంక జట్టు స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం శ్రీలంక క్రికెట్ బోర్డు( Cricket Board) స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆల్‌రౌండర్ ధనంజయ డిసిల్వా(Dhananjaya de Silva)...
Srilanka : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC 2023-25)లో వెనకబడిన శ్రీలంక జట్టు స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం శ్రీలంక క్రికెట్ బోర్డు( Cricket Board) స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆల్‌రౌండర్ ధనంజయ డిసిల్వా(Dhananjaya de Silva) కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. పేసర్ కసున్ రజితతో పాటు ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.
ఈ టెస్టుతో లహిరు ఉడార, చమిక గుణశేఖర, మిలాన్ రత్ననాయకేలు అరంగేట్రం చేసే చాన్స్ ఉంది. నిరుడు పాకిస్థాన్ చేతిలో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఓడిన లంక ఈసారి కాబూలీ జట్టును చిత్తు చేయాలనే కసితో ఉంది.
Sri Lanka Test Squad revealed for the clash against Afghanistan. 📣
Mark your calendars for the 2nd of February at SSC grounds, Colombo. #SLvAFG pic.twitter.com/RRwlmPUhRZ
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 31, 2024
శ్రీలంక టెస్టు స్క్వాడ్ : ధనంజయ డిసిల్వా(కెప్టెన్), కుశాల్ మెండిస్, కరుణరత్నే, మధుష్క, ఆంజెలో మాథ్యూస్, చండీమాల్, సమరవిక్రమ, మెండిస్, ఎ.ఫెర్నాండో, వి.ఫెర్నాండో, రజిత, మెండిస్, జయసూర్య, ఉడార, గుణశేఖర.
ఇప్పటికే అఫ్గనిస్థాన్ బోర్డు హష్మతుల్లా షాహిదీ(Hashmatullah Shahidi) సారథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid Khan) స్థానం లెగ్ స్పిన్నర్ ఖైస్ అహ్మద్(Qais Ahmad) చోటు దక్కించుకున్నాడు. ఇరుజట్ల మధ్య కొలంబోలో ఫిబ్రవరి 2న ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది. అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లో లంక, అఫ్గనిస్థాన్ తలపడనున్నాయి.
𝐈𝐭 𝐁𝐞𝐠𝐢𝐧𝐬 𝐓𝐨𝐦𝐨𝐫𝐫𝐨𝐰! 🤩
AfghanAtalan are all set to begin their maiden test match against Sri Lanka at 9:00 AM (AFT) tomorrow at the Sinhalese Sports Club Cricket Ground in Colombo. 👍#AfghanAtalan | #SLvAFG2024 pic.twitter.com/SIYXci79rX
— Afghanistan Cricket Board (@ACBofficials) February 1, 2024
అఫ్గనిస్థాన్ టెస్టు స్క్వాడ్ : హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), ఇబ్రహీం జర్డాన్, అబ్దుల్ మాలిక్, నూర్ అలీ జద్రాన్, రహ్మత్ షా(వైస్ కెప్టెన్), బషీర్ షా, నసీర్ జమాల్, ఇక్రమ్ అలిఖిల్, మహ్మద్ ఇషాక్, ఖాసీ అహ్మద్, జియా ఉర్ రెహ్మాన్, జహీర్ ఖాన్, యమిన్ అహ్మద్జాయ్, నిజత్ మసూద్, మహ్మద్ సలీం, నవీద్ జద్రాన్.
ఇవి కూడా చదవండి
- Budget 2024-25 | ఆదాయం పన్ను చెల్లింపులు మరింత సులభతరం.. విత్త మంత్రి నిర్మల
- Ricky Ponting | అమెరికా టీ20 లీగ్ జట్టు కోచ్‌గా పాంటింగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ సంగతేంటి..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

