హైదరాబాద్ : కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా వారికి అండగా నిలుస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(MLA Marri Rajasekhar Reddy )అన్నారు. బుధవారం మేడే వేడుకలు(Mayday )కంటోన్మెంట్ వ్యాప్తంగా కార్మికులు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్‌లోని మోండా డివిజన్, కార్ఖానా, బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బొల్లారంలలో కార్మికులు మేడే వేడుకలను సంబురంగా జరుపుకున్నారు.
ఈ క్రమంలో మేడేను పురస్కరించుకుని బోయిన్పల్లి క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితతో కలిసి ఎమ్మెల్యే కార్మిక జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, వారి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు.
ఆదే విధంగా బోయిన్పల్లి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మిక జెండాను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి ఎగురవేశారు. దీంతో పాటు బోయిన్పల్లి క్యాంపు కార్యాలయంలోనే కార్మిక జెండాను కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి ఆవిష్కరించారు.