T20 World Cup 2024 : పొట్టి ప్రపంచకప్ టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలవ్వడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (Australia Cricket Board) స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని బుధవారం సెలెక్టర్లు వెల్లడించారు. నిరుడు వన్డే, టెస్టులకు వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్‌కు సెలెక్టర్లు వరల్డ్ కప్ చాన్స్ ఇచ్చారు. ఐపీఎల్లో సెంచరీ బాదిన మార్కస్ స్టోయినిస్ (MarcusStoinis), యువకెరటం టిమ్ డేవిడ్‌లు అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చారు.
ఇక ఆల్రౌండర్లుగా కామెరూన్ గ్రీన్, మ్యాక్స్‌వెల్‌లు చోటు దక్కించుకున్నారు. బౌలింగ్ యూనిట్లో స్టార్క్, కమిన్స్, ఎల్లిస్, ఆడం జంపాలు ప్రత్యర్థలు భరతం పట్టనున్నారు. అయితే.. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇరగదీస్తున్న యంగ్‌స్టర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌లకు నిరాశే మిగలింది.
Introducing our 15-player squad for the ICC Men’s T20 World Cup to head to the West Indies – led by our new full-time T20 skipper, Mitch Marsh 👊
Congratulations to those selected 👏#T20WorldCup pic.twitter.com/vETFIGPQL6
— Cricket Australia (@CricketAus) May 1, 2024
కంగారూ సైన్యమిదే : డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆడం జంపా.
Bring on the West Indies! 🌴
We’re pleased to announce that @hcltech will be joining our Aussie men’s team on their T20 World Cup journey as playing and training kit partner.#T20WorldCup pic.twitter.com/0meTw55Rj0
— Cricket Australia (@CricketAus) May 1, 2024
కంగారూ జట్టు హ్యాట్రిక్ ఐసీసీ ట్రోఫీ వేటకు సిద్దమైంది. నిరుడు టెస్టు గదతో పాటు వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ తన్నుకుపోయిన ఆసీస్ మరోసారి టీ20 వరల్డ్ కప్‌ను పట్టేయాలనే పట్టుదలతో ఉంది. అరోన్ ఫించ్ సారథ్యంలో ఆసీస్ 2021 పొట్టి ప్రపంచకప్ చాంపియన్‌గా అవతరిచింది. ఇప్పుడు ఆసీస్ జట్టు ఆటగాళ్లు హెడ్, స్టోయినిస్, టిమ్ డేవిడ్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. వీళ్లు గనుక చెలరేగితే మెగా టోర్నీలో ఆసీస్‌కు ఎదురుండకపోవచ్చు.
వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 1న షురూ కానుంది. తొలిపోరులో ఆస్ట్రేలియా జూన్ 6వ తేదీన పసికూన ఒమన్‌తో తలపడనుంది.