Srilanka Cricket : పొట్టి వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత మాజీ చాంపియన్ అయిన శ్రీలంక (Srilanka) పని అయిపోయింది.. చిన్న జట్లకు కూడా పోటీ ఇవ్వలేకపోతోంది అనే విమర్శలు వచ్చాయి. కానీ, రెండంటే రెండే నెలల్లో లంక ఆట మారింది. స్వదేశంలో టీమిండియాపై వన్డే సిరీస్, అనంతరం ఇంగ్లండ్‌పై ఓవల్ మైదానంలో చిరస్మరణీయ విజయం లంక పోరాటపటిమకు అద్ధం పట్టాయి.
తాజాగా సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్‌లో బలమైన న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసి అదరహో అనిపించింది. అమ్మో.. శ్రీలంకనా.? తక్కువ అంచనా వేయొద్దు బాస్! అనుకునేలా ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపింది. దాంతో, లంక సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక జట్టును గాడీలో పెట్టి, అద్భుత విజయాలతో అబ్బురపరిచిన సనత్ జయసూర్య (Sanath Jayasuriya)ను పూర్తి స్థాయి కోచ్‌గా నియమించారు.
Sri Lanka Cricket wishes to announce the appointment of Sanath Jayasuriya as the head coach of the national team.
The Executive Committee of Sri Lanka Cricket made this decision taking into consideration the team’s good performances in the recent tours against India, England,… pic.twitter.com/IkvAIJgqio
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 7, 2024
ఇప్పటివరకూ తాత్కాలిక కోచ్‌గా సేవలందించిన జయసూర్య ఇక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ వెటరన్ క్రికెటర్ 2026 మార్చి వరకూ ఆ పదవిలో కొనసాగుతారని సోమవారం లంక బోర్డు తెలిపింది. ఈ దిగ్గజ ఆటగాడి సలహాలతో, సూచనలతో చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచే దిశగా శ్రీలంక జట్టు అడుగులేస్తోంది.
Sri Lanka clinch the series in style! 🏆🇱🇰 #SLvNZ
Dominant performance sees them win the second Test by an innings and 154 runs, taking the series 2-0.
Congratulations to the team on a fantastic series win! 🎉 pic.twitter.com/XbbAdlvo7k
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 29, 2024
వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్‌లో లంక లీగ్ దశలోనే ఇంటికి వెళ్లింది. దాంతో, ‘నేను ఈ జట్టుకు కోచ్‌గా ఉండలేనంటూ’ క్రిస్ సిల్వరహుడ్ (Chris Silverhood) పదవికి రాజీనామా చేశాడు. వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ .. ఆ మరుసటి ఏడాది పొట్టి ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలు ఉండడంతో లంక బోర్డు దేశీయ కోచ్ వైపే మొగ్గు చూపింది. వరల్డ్ కప్ హీరో అయిన జయసూర్యను సంప్రదించింది. మసకబారుతున్న లంక క్రికెట్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు తాను ‘సిద్ధమే’ అంటూ జయసూర్య ఒకే చెప్పేశాడు.
మొదట సెప్టెంబర్‌లో లంక జట్టు ఇంగ్లండ్ పర్యటన (England Tour) వరకు అతడు కోచ్‌గా ఉంటాడని, అతడు జాతీయ జట్టును చక్కగా నడిపిస్తాడని నమ్ముతున్నామని అని బోర్డు వివరించింది. అనుకున్నట్టే జయసూర్య తన మార్క్ చూపించి జట్టును గెలుపు పట్టాలెక్కించాడు. అందుకని అతడిని పూర్తి స్థాయి ప్రధాన కోచ్‌గా లంక బోర్డు నియమించింది.
A proud moment for Nishan Peiris as he receives his Test debut cap from Dilruwan Perera! He’s set to become the 1️⃣6️⃣7️⃣th Test player for Sri Lanka. #SLvNZ pic.twitter.com/3Go90brjjQ
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 26, 2024
గతంలో జయసూర్య నేషనల్ సెలెక్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నాడు. ప్రపంచంలోని విధ్వంసక ఆటగాడిగా పేరొందిన జయసూర్య 2007 టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఆర్రౌండర్ కూడా అయిన అతడు నాలుగేండ్లకు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.