AP Rains | ఏపీలో ఈనెల 10 నుంచి మళ్లీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
AP Rains | ఏపీలో మళ్లీ వర్షాలు (Rains) కురవనున్నాయి. ఈ నెల 10 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అమరావతి : ఏపీలో మళ్లీ వర్షాలు (Rains) కురవనున్నాయి. ఈ నెల 10 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ(Meteorological ) హెచ్చరికలు జారీ చేసింది. ఇదే నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఆదివారం ఏలూరు(Eluru), తూర్పుగోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, ఎన్టీఆర్, అనకాపల్లి, కర్నూలు(Kurnool), నంద్యాల, తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజమహేంద్రవరంలో 53 మి.మీ. వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది.
కావలిలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలుగా నమోదైంది. కావలి, విశాఖపట్నం, తుని, కాకినాడ, నెల్లూరు, కడప, అనంతపురం, నందిగామ, నరసాపురం, తిరుపతి, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

