INDW vs SLW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో చావోరేవో మ్యాచ్‌లో భారీ స్కోర్ కొట్టిన టీమిండియా బౌలింగ్‌లో అదరగొడుతోంది. పేసర్ రేణకా సింగ్ (2/3) సంచలన ప్రదర్శనతో లంక టాపార్డర్ కుప్పకూలింది. ఆకాసేపటికే యువకెరటం శ్రేయాంక పాటిల్(1/11) డేంజరస్ చమరి ఆటపట్టు(1)ను బోల్తా కొట్టించింది. ఆసియా కప్‌లో చెలరేగిన హర్షిత సమరవిక్రమ(3)ను రేణుకా ఔట్ చేసి లంకను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుతం కవిశ దిల్హరి(8), అనుష్క సంజీవని (12)లు ఆడుతున్నారు. ఆరు ఓవర్లకు శ్రీలంక స్కోర్.. 28-3.
కొండంత ఛేదనలో శ్రీలంకకు తొలి ఓవర్లోనే రేణుకా షాకిచ్చింది. రెండో బంతికే విశ్మీ గౌతమ్(0)ను డకౌట్ చేసింది. విశ్మీ ఆడిన బంతిని రాధా యాదవ్ పరుగెత్తుతూ వెళ్లి అందుకుంది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే లంక సారథి చమరి ఆటపట్టు(1)ను శ్రేయాంక వెనక్కి పంపింది. స్లిప్‌లో దీప్తి శర్మ చక్కని క్యాచ్ పట్టగా లంక 4 పరుగులకే రెండో వికెట్ కోల్పోయింది. మరోసారి బంతి అందుకున్న రేణుకా స్వింగ్‌తో సమరవక్రమ(3)ను ఔట్ చేసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీసింది.
#TeamIndia post 172/3 in the first innings 🔥🔥
Half-centuries from Captain Harmanpreet Kaur & Vice-Captain Smriti Mandhana! 🫡
43 from Shafali Verma 👌
2nd innings coming up ⏳
📸: ICC
Scorecard ▶️ https://t.co/4CwKjmWL30#T20WorldCup | #INDvSL | #WomenInBlue pic.twitter.com/WJH1mqDGh7
— BCCI Women (@BCCIWomen) October 9, 2024
వరల్డ్ కప్‌లో చావోరేవో మ్యాచ్. భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ రేసులో ఉండే పరిస్థితిలో భారత బ్యాటర్లు పంజా విసిరారు. ఆసియా కప్ ఫైనల్లో షాకిచ్చిన శ్రీలంకపై కొండంత స్కోర్ కొట్టారు. ఓపెనర్లు స్మృతి మంధాన(50), షఫాలీ వర్మ(43) తొలిసారి అదిరే ఆరంభమివ్వగా.. ఆఖర్లో హర్మన్‌ప్రీత్ కౌర్(52 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆఖరి ఓవర్లో వరుసగా రెండు బంతుల్ని బౌండరీకి పంపి అర్ధ శతకంతో జట్టు స్కోర్ 170 దాటించింది. ఈ ముగ్గురి దూకుడు భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికే 172 పరుగులు చేసింది. ఈసారి వరల్డ్ కప్‌లో ఇదే అత్యధిక స్కోర్.