Health tips | మైదా మంచిదే అనుకుని అతిగా తింటున్నారా.. మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి..!
Health tips : సాధారణంగా చాలామంది చపాతి, పరోట, రుమాలీ రోటి, తందూరీ రోటి లాంటి వాటిని ఇష్టంగా తింటుంటారు. అవి ఆరోగ్యానికి ప్రమాదం కాకపోయినా వాటి తయారీకి మైదాను ఎక్కువగా వాడితే మాత్రం ముప్పు తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇండ్లలో సంగతి ఎలా ఉన్నా బయట హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో మాత్రం మైదాను విపరీతంగా ఉపయోగిస్తుంటారు. అయితే మైదా పిండితో చేసే పదార్థాలను తినే ముందు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
Health tips : సాధారణంగా చాలామంది చపాతి, పరోట, రుమాలీ రోటి, తందూరీ రోటి లాంటి వాటిని ఇష్టంగా తింటుంటారు. అవి ఆరోగ్యానికి ప్రమాదం కాకపోయినా వాటి తయారీకి మైదాను ఎక్కువగా వాడితే మాత్రం ముప్పు తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇండ్లలో సంగతి ఎలా ఉన్నా బయట హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో మాత్రం మైదాను విపరీతంగా ఉపయోగిస్తుంటారు. మైదాపిండి గోధుమ పిండి కంటే తక్కువ ధరకు లభించడం, మైదాతో చేసే పదార్థాలు తెల్లగా, రుచిగా ఉండటం దాని అతి వినియోగానికి కారణం. అయితే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మైదా పిండితో చేసే పదార్థాలను తినే ముందు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
మైదా ఎందుకు ప్రమాదకరం..?
మిల్లులలో గోధుమ పిండిని బాగా పాలీష్ చేసి, వివిధ రసాయనాలను కలిపి మైదా పిండిని తయారు చేస్తారు. ఎక్కువగా పాలిష్ చేయడంవల్ల మైదాపిండికి మెత్తదనం, క్లోరైడ్ గ్యాస్, బైంజైల్ పెరాక్సైడ్ లాంటి రసాయనాల మిక్సింగ్వల్ల తెల్లదనం వస్తాయి. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరం. అందుకే చైనాతోపాటు, యూరప్ దేశాలు బెంజైల్ పెరాక్సైడ్ వాడకంపై నిషేధం విధించాయి. మైదాలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే Alloxan అనే విషపూరితమైన రసాయనం కూడా ఉంటుంది.
మైదాతో అనర్థాలేమిటి..?
1. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా ఎంతోకొంత పీచు పదార్థం ఉండాలి. కానీ మైదాలో పీచుపదార్థం జీరో. కాబట్టి మైదా త్వరగా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుపోతుంది. దీనివల్ల పేగుల్లో పుండ్లు పడే ప్రమాదం ఉన్నది. అవి ముదిరితే క్యాన్సర్ లాంటి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి.
2. మైదా పిండిని గోడలకు పోస్టర్లను అంటించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే మైదాపిండిలోని జిగురు పోస్టర్లు గోడకు గట్టిగా అంటుకునేలా చేస్తుంది. మైదాతో చేసిన పదార్థాలను తిన్నప్పుడు అవి మన పేగులకు కూడా అలాగే అతుక్కుపోతాయి. దాంతో వాటిలో క్రిములు ఉత్పత్తయ్యి ఇన్ఫెక్షన్లను కలుగజేస్తాయి.
3. మైదాపిండివల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. అంతేగాక మహిళలల్లో బ్రెస్ట్ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
4. మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండటంవల్ల పొట్ట వస్తుంది. ప్రొటీన్లు నామమాత్రంగా ఉంటాయి.
5. అదేవిధంగా మైదాలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఒంట్లో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

