అక్లాండ్: న్యూజిలాండ్తో శనివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో శ్రీలంక 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 291 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్..29.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. అసిత ఫెర్నాండో (3/26), మహేశ్ తీక్షణ(3/35), ఇషాన్ మలింగ(3/35) ధాటికి కివీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
మార్క్ చాప్మన్(81) అర్ధసెంచరీతో ఒంటరిపోరాటం చేయగా, విల్యంగ్, టామ్లాథమ్, ఫిలిప్స్ డకౌట్లుగా వెనుదిరిగారు. తొలుత నిస్సనక(66), కుశాల్ మెండిస్(54), జతిన్ లియాంగె(53) అర్ధసెంచరీలతో లంక 50 ఓవర్లలో 290/8 స్కోరు చేసింది. మ్యాట్ హెన్రీ(4/55) నాలుగు వికెట్లతో రాణించాడు. ఫెర్నాండోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, హెన్రీకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.