పల్లెకెలె: ఇటీవలే భారత్‌ను భారత్‌లో ఓడించి చారిత్రక టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్‌కు శ్రీలంక స్వదేశంలో చుక్కలు చూపించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను లంకేయులు 2-0తో గెలుచుకున్నారు. తొలి రెండు వన్డేల్లో లంక గెలవగా మంగళవారం జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయ్యింది. వాన వల్ల ఆట ఆగే సమయానికి కివీస్ 21 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి 112 పరుగులు చేసింది. అంతకుముందు జరిగిన టెస్టు సిరీస్‌నూ లంక 2-0తో క్లీన్‌స్వీప్ చేయగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇరు జట్లూ పంచుకున్నాయి.