ముంబై : బంగ్లాదేశ్తో ఆగస్టులో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్లు రైద్దెన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తమ దేశానికి రావాలని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) బీసీసీఐని కోరింది. అదే ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు శ్రీలంక పర్యటనకు రావాలని ఎస్ఎల్సీ.. బీసీసీఐకి లేఖ రాసినట్టు బోర్డు వర్గాల వినికిడి.
దీనిపై బోర్డు ఇంకా స్పందించలేదు. ఒకవేళ బీసీసీఐ గనక ఈ ప్రతిపాదనకు సరే అంటే.. అభిమానులు భారత క్రికెట్ దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను వీక్షించే అవకాశం ఉంటుంది.