IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఎట్టకేలకు మూడో విజయంతో మురిసిపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను ఓడించి ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఈ విక్టరీని కమిన్స్ సేన ప్రకృతి అందాలతో అలరారే మాల్దీవ్స్(Maldeevs)లో సెలబ్రేట్ చేసుకుంటోంది.
తదుపరి మ్యాచ్‌లో కమిన్స్ బృందం మే2న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను ఢీ కొట్టనుంది. కీలకమైన ఈ పోరుకు ఐదు రోజులు ఉండడంతో ఆరెంజ్ ఆర్మీ స్క్వాడ్ అంతా మాల్దీవ్స్‌లో వాలిపోయారు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌లు కుటుంబంతో వెళ్లారు. అక్కడి రిసార్ట్ నిర్వహాకులు సన్‌రైజర్స్ ఆటగాళ్లకు తమ సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
A warm welcome for our Risers in Maldives for their team bonding retreat 🏖️🧡 pic.twitter.com/wirokoXuFb
— SunRisers Hyderabad (@SunRisers) April 27, 2025
కనుచూపుమేర నీలి సముద్రంతో ఆహ్లాదకరంగా ఉన్న మాల్దీవ్స్‌లో హైదరాబాద్ క్రికెటర్లు సేదతీరుతున్న వీడియోను హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ దొరకడంతో.. ఆటగాళ్లు రిలాక్స్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ట్రిప్ ప్లాన్ చేసింది యాజమాన్యం.
Sun, sea, and a team retreat for our Risers in the Maldives! 🏖️✈️ pic.twitter.com/CyE0MvZHy3
— SunRisers Hyderabad (@SunRisers) April 26, 2025
పదిహేడో సీజన్లో రికార్డు స్కోర్లతో అలరించిన సన్‌రైజర్స్ చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 18వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌పై అదిరే విజయంతో టోర్నీని ఆరంభించింది. కానీ, వరుసగా ఓటములతో నిరాశపరిచింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్(Punjab Kings)ఫై విక్టరీతో గాడిలో పడినట్టే అనిపించినా మళ్లీ పరాజయాల బాట పట్టింది.
Not stopping here 💪#PlayWithFire | #CSKvSRH | #TATAIPL2025 pic.twitter.com/YRYHmEB9hw
— SunRisers Hyderabad (@SunRisers) April 25, 2025
టాపార్డర్ నిలకడలేమి కారణంగా వరుసగా ముంబై, గుజరాత్, కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడి అట్టడుగున నిలిచింది. ఇక పనైపోయినట్టే అనుకున్నవేళ చెన్నై కంచుకోట చెపాక్‌లో కమిన్స్ బృందం అద్భుత విజయంతో ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. 155 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించి ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఇంకా ఐదు మ్యాచుల్లో గెలిస్తే తప్ప సన్‌రైజర్స్ జట్టు ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం కష్టం.