IPL 2025 : ఐపీఎల్ అంటేనే పవర్ హిట్టర్లు, పరుగులు వరదకు కేరాఫ్. అలాంటి ఈ పొట్టి క్రికెట్ లీగ్‌లో రికార్డుబ్రేకర్స్ చాలామందే. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు మాత్రం ప్రత్యేకం అని చెప్పాలి. నిరుడు అత్యధిక స్కోర్‌తో రికార్డులు బద్ధలు కొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి కూడా తగ్గేదేలే అంటూ తొలి పోరులోనే 286 పరుగులు చేసింది. అయితే.. ఈ ఎడిషన్‌లో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో లేదు. కానీ, ఓపెనర్ల విధ్వంసంతో అత్యధిక పరుగుల భాగస్వామ్వం నమోదు చేసింది కమిన్స్ సేన.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) సెంచరీతో గర్జించగా.. ట్రావిస్ హెడ్ బౌండరీలతో మోత మోగించాడు. దాంతో, 18వ ఎడిషన్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారిద్దరు. ఉప్పల్ మైదానంలో పంజాబ్ బౌలర్లను ఊచకోత కోసిన ఈ చిచ్చరపిడుగులు 75 బంతుల్లోనే 171 రన్స్ పిండుకున్నారు. ఇప్పటివరకూ జరిగిన లీగ్ దశలో ఇదే రికార్డు పార్ట్నర్షిప్ కావడం విశేషం. రెండో స్థానంలో రాజస్థాన్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యజస్వీ జైస్వాల్ జోడీ ఉంది.
When 𝐑𝐮𝐧𝐬 𝐆𝐚𝐥𝐨𝐫𝐞 from both ends 🤜🤛
Folks, which of these blockbuster partnerships would you love rewatching? 🍿🤔#TATAIPL pic.twitter.com/GLW6VtiXpj
— IndianPremierLeague (@IPL) May 16, 2025
విధ్వంసక బ్యాటింగ్‌తో వైభవ్ 35 బంతుల్లోనే శతకం సాధించగా.. గుజరాత్ బౌలర్లను చితక్కొడుతూ యశస్వీ అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. దాంతో ఈ ద్వయం తొలి వికెట్‌కు 166 పరుగులు జోడించింది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు మూడో స్థానంలో నిలిచారు. పవర్ ప్లేలో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లపై విరుచుకుపడిన ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్లు 120 రన్స్‌తో శుభారంభం ఇచ్చారు. ఈ సీజన్లో టాప్ గేర్‌లో ఆడుతున్న గుజారాట్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ కూడా 120 పరుగులు చేయగా.. కరుణ్ నాయర్, అభిషేక్ పొరెల్(ఢిల్లీ క్యాపిటల్స్) 119 పరుగులతో టాప్ 5లో చోటు సంపాదించారు.
ఐపీఎల్ 18వ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో సూర్యకుమార్ యాదవ్ అందరికంటే ముందున్నాడు. వరుసగా 11 మ్యాచుల్లో 25 ప్లస్ స్కోర్ చేసిన అతడి ఖాతాలో 510 పరుగులు ఉన్నాయి. అతడి వెనకాలే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్(509), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(508) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
The race is getting tighter everyday 🏃
Who will emerge victorious? 🤔#TATAIPL pic.twitter.com/YG8JznIBKu
— IndianPremierLeague (@IPL) May 15, 2025
గుజరాత్ పేసర్ ప్రసిధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ ఒడిసిపట్టేయనున్నాడు. ఈ పొడగరి పేసర్ లీగ్ దశలో వికెట్లు పడగొట్టాడు. సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా 20 వికెట్లు తీశాడు. కానీ, రెండు లీగ్ మ్యాచుల్లో అతడు ప్రసిధ్‌ను అధిగమించినా.. ప్లే ఆఫ్స్ ఆడడు. సో.. 18 వికెట్లతో మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ పోటీనిచ్చే అవకాశముంది.