కట్టంగూర్, మే 16 : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం పి.వెంకటరమణ అన్నారు. శుక్రవారం మండలంలోని దుగినవెల్లి గామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల వద్దకు వెళ్లి బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు ప్రభుత్వ కల్పిస్తుందన్నారు. పాఠశాలల్లో వసతులు కల్పించడంతో పాటు మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మిట్టపల్లి మురళయ్య, వెంకట్ వెంకటకృష్ణ, ఏఎంసీ చైర్మన్ సైదమ్మ పాల్గొన్నారు.