మిర్యాలగూడ, మే 16 : మిర్యాలగూడ పట్టణంలోని తడకమళ్ల క్రాస్‌రోడ్డు వద్ద నిర్మించిన కూడలి రౌండ్ వెడల్పును తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలగోని వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ.. బ్యూటిఫికేషన్ రౌండ్ వెడల్పుగా ఉన్నందున వచ్చిపోయే వాహనాలకు ఇరుకుగా ఉందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ఆధికారులు వెంటనే స్పందించి రౌండ్ వెడల్పు తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుండు నరేందర్‌గౌడ్, చౌగాని వెంకన్నగౌడ్, గాదగోని మహేశ్‌కుమార్ గౌడ్, పులి విద్యాసాగర్‌గౌడ్, అంతటి రాములు, దోరేపల్లి రాములు, తెల్లపాటి వెంకటేశ్వర్లు, పులి శ్రీనివాస్ పాల్గొన్నారు.