హుజూరాబాద్, మార్చి 14 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని అంబేదర్ చౌరస్తా వద్ద రైతు ప్రజాసంఘా ల సమాఖ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా నా యకుడు ముచ్చా సమ్మిరెడ్డి శనివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా రైతు భరో సా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అ సెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.