IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. నిరుడు రన్నరప్‌గా నిలిచిన కమిన్స్ బృందం ఈసారి నిలకడ లేమితో సతమతం అవుతోంది. వరుసగా మూడు ఓటములతో ఆరెంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు ఆదివారం సొంత మైదానంలో గుజరాత్ టైటన్స్ (Gujarat Titans) సవాల్‌కు సిద్ధమైంది. ఈమ్యాచ్‌లో అయినా టాపార్డర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాలని.. మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది హెస్ఆర్హెచ్.
ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం సన్‌రైజర్స్ టాపార్డర్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. గత మూడు మ్యాచుల్లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్(Travis Head), అభిషేక్ శర్మ(ASharma)లు స్వల్ప స్కోర్లకే పరిమితం కాగా.. ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డిలు దారుణంగా విఫలమయ్యారు. హెడ్ ఫర్వాలేదనిపించినా.. అభిషేక్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. లక్నోపై 6, ఢిల్లీ 1 , కోల్‌కతాపై (2 పరుగులు) తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
𝐘𝐨𝐮𝐧𝐠 💪
𝐅𝐞𝐚𝐫𝐥𝐞𝐬𝐬 👊
𝐈𝐧-𝐟𝐨𝐫𝐦 ✨Aniket Verma and Sai Sudharsan face off in the #SRHvGT clash!
Are you activating the 𝐆𝐚𝐦𝐞 𝐂𝐡𝐚𝐧𝐠𝐞𝐫 𝐏𝐥𝐚𝐲𝐞𝐫 booster tonight? 🕹️
Head to https://t.co/sdVARQnTre to make your team!#TATAIPL | @SunRisers |… pic.twitter.com/nQTSvKNp3U
— IndianPremierLeague (@IPL) April 6, 2025
ఇక యువకెరటం కిషన్ రాజస్థాన్‌పై ఇదే మైదానంలో సెంచరీతో గర్జించాడు. కానీ, తదుపరి లక్నోపై డకౌట్ అయిన ఈ చిచ్చరపిడుగు విశాఖలో తేలిపోయాడు. ఈడెన్ గార్డెన్స్‌లో హెడ్, అభిషేక్.. ఔటయ్యాక వచ్చిన అతడు 2 పరుగులకే వికెట్ పారేసుకున్నాడు. గత సీజన్లో రెచ్చిపోయి ఆడిన హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klassen) ఈసారి తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడం లేదు. యువకుడు అనికేత్ వర్మ మిడిలార్డర్లో ధనాధన్ ఆడుతున్నా అతడికి సహరించేవాళ్లు కరువయ్యారు. ఫలితంగా హ్యాట్రిక్ ఓటములతో రగిలిపోతున్న సన్‌రైజర్స్ టాప్ గన్స్.. గుజరాత్‌పై పంజా విసిరేందుకు సిద్ధమవుతున్నారు.
అభిషేక్, హెడ్, క్లాసెన్
బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై హైదరాబాద్ హిట్టర్లు దంచికొడుతారా? మళ్లీ తోకముడుస్తారా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ, గుజరాత్ల మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడింట రెండు విక్టరీలతో జోరుమీదున్న శుభ్‌మన్ గిల్ సేనతో హోరాహోరీ పోరు అభిమానులను అలరించడం ఖాయం.